అక్షరటుడే, కామారెడ్డి : TNGOs Kamareddy | జిల్లా వ్యవసాయ శాఖ ఫోరంలో టీఎన్జీవోస్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో సోమవారం సభ్యత్వ నమోదు కార్యక్రమం చేపట్టారు. వ్యవసాయ శాఖలో (Agriculture Department) విధులు నిర్వర్తిస్తున్న ఉద్యోగులు టీఎన్జీవోస్ సభ్యత్వాన్ని తీసుకున్నారు.
ఈ సందర్భంగా ఉద్యోగులు మాట్లాడుతూ.. 80 ఏళ్ల చరిత్ర కలిగి ఉద్యోగుల సమస్యల పట్ల చిత్తశుద్ధితో పనిచేస్తున్న టీఎన్జీవోస్ సంఘంలో (TNGOs Association) సభ్యత్వం తీసుకోవడం ఆనందంగా ఉందని తెలిపారు. భవిష్యత్తులో కూడా ఉద్యోగుల సమస్యలపై పోరాడి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని ఉద్యోగులు ఆకాంక్షించారు.
కార్యక్రమంలో టీఎన్జీవోస్ జిల్లా అధ్యక్షుడు నరాల వెంకటరెడ్డి (Narala Venkata Reddy), జిల్లా కార్యదర్శి ముల్క నాగరాజు, కేంద్ర సంఘ బాధ్యులు కె.శివకుమార్, జిల్లా సహా అధ్యక్షుడు చక్రధర్, జిల్లా కోశాధికారి దేవరాజు, జిల్లా ఉపాధ్యక్షులడు రాజేశ్వర్, జిల్లా ఆర్గనైజింగ్ సెక్రెటరీ సంతోష్, అర్బన్ తాలూకా ఉపాధ్యక్షుడు కిషన్, వ్యవసాయ శాఖ ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు.
