అక్షరటుడే, కామారెడ్డి : Temple Pond Dead Body | చుక్కాపూర్ (Chukkapur) లక్ష్మీనృసింహస్వామి ఆలయ కోనేరులో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైంది. ఈ మేరకు పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు.
Temple Pond Dead Body | లక్ష్మీ నృసింహస్వామి ఆలయంలో..
మాచారెడ్డి ఎస్సై అనిల్ (Macha Reddy SI Anil) తెలిపిన వివరాల ప్రకారం.. మంగళవారం సాయంత్రం 7 గంటల ప్రాంతంలో చుక్కాపూర్ గ్రామ శివారులో ఉన్న లక్ష్మీనరసింహస్వామి (Lakshminrasimhaswamy) ఆలయ కోనేరులో గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం ఉన్నట్లు స్థానికులు గుర్తించారు. వెంటనే పోలీసులకు సమాచారం అందజేశారు. దీంతో పోలీసులు ఫైర్‌స్టేషన్ సిబ్బంది సహకారంతో మృతదేహాన్ని బయటకు తీశారు. మృతుడి వయస్సు 30 నుంచి 40ఏళ్ల వరకు ఉండవచ్చని.. బ్లూ టీషర్టు, వైట్ ప్యాంట్ ధరించి ఉన్నాడని.. ఇతర సమాచారం కోసం మాచారెడ్డి ఎస్సై 8712686151ను సంప్రదించాలని పోలీసులు కోరారు.