అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: News Year Celebrations | న్యూఇయర్ వేడుకల్లో పోలీసు సూచనలు పాటించాలని ఇన్‌ఛార్జి సీపీ రాజేష్ చంద్ర (In-charge CP Rajesh Chandra) పేర్కొన్నారు. ఈ మేరకు శనివారం ప్రకటన విడుదల చేశారు.
News Year Celebrations | మత్తులో రోడ్లపై తిరగవద్దు..
న్యూ ఇయర్ వేడుకల (New Year celebrations) పేరుతో అతిగా మద్యం సేవించి రోడ్లపై వేగంగా వెళ్తూ ప్రమాదాలకు కారణం కాకూడదని ఇన్‌ఛార్జి సీపీ పేర్కొన్నారు. వేగంగా వాహనాలు నడుపుతూ.. ఇతరులను ఇబ్బంది పెట్టడమే కాకుండా తమ జీవితాలు కూడా రిస్క్‌లో పెట్టుకోవద్దని హితవు పలికారు.
News Year Celebrations | నిఘా నీడలో పట్టణం..
న్యూ ఇయర్ వేడుకల్లో భాగంగా 31వ తేదీ సాయంత్రం నుంచి పోలీసులు నగరం నలుదిక్కులా అప్రమత్తంగా ఉంటారని ఇన్‌ఛార్జి సీపీ సూచించారు. నిబంధనలు అతిక్రమించిన వారిపై కఠిన చర్యలకు ఏమాత్రం వెనకాడబోమని ఆయన వెల్లడించారు. ఎక్కడ కూడా పోలీస్ అనుమతి (police permission) లేకుండా న్యూ ఇయర్ సెలబ్రేషన్లు చేయడం చట్టవిరుద్దమన్నారు. ఫామ్ హౌస్, క్లబ్‌లు, గేటెడ్ కమ్యూనిటీలో అనుమతిలేకుండా నూతన సంవత్సర కార్యక్రమాలు నిర్వహించరాదని వివరించారు.
News Year Celebrations | పరిమితిలోనే సౌండ్ సిస్టం..
సెలబ్రేషన్లలో భాగంగా పరిమితికి మించకుండా సౌండ్ సిస్టం వాడాలని సీపీ సూచించారు. ప్రజలను భయాందోళనకు, ఇబ్బందులకు గురయ్యే విధంగా క్రాకర్స్, ఆర్కెస్ట్రా పెట్టవద్దని పేర్కొన్నారు. కొన్ని ప్రదేశాల్లో వృద్ధులు, అనారోగ్యంతో బాధపడుతున్నవారికి ప్రాణాలకు ముప్పువాటిల్లే అవకాశముందని ఆయన తెలిపారు.
News Year Celebrations | ట్రాఫిక్ నిబంధనలు..
నిజామాబాద్ కమిషనరేట్ (Nizamabad Commissionerate) పరిధిలోని నిజామాబాద్, ఆర్మూర్, బోధన్ డివిజన్ పరిధిలోని అన్ని పోలీస్‌స్టేషన్ పరిధిలలో న్యూ ఇయర్ వేడుకలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని ఆయన తెలిపారు. కాబట్టి ప్రతిఒక్కరూ తూచా తప్పకుండా ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని సూచించారు. డ్రంక్ డ్రైవ్ తనిఖీలు చేపడతామని పేర్కొన్నారు.