Kamareddy SP Rajesh Chandra | కామారెడ్డిలో కారు దహనం కేసులో ఇద్దరి అరెస్ట్..

అక్షరటుడే, కామారెడ్డి: Kamareddy SP Rajesh Chandra | కామారెడ్డి ఎమ్మెల్యే క్యాంప్​ కార్యాలయం వద్ద కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకుడి కారుకు బీజేపీ కార్యకర్తలు నిప్పు పెట్టిన విషయం తెలిసిందే. అయితే ఈ ఘటనపై పోలీసులు ఇద్దరిని అరెస్ట్ చేయడం జరిగిందని ఎస్పీ రాజేష్ చంద్ర (SP Rajesh Chandra) ఒక ప్రకటనలో తెలిపారు.

Kamareddy SP Rajesh Chandra | క్యాంప్ కార్యాలయం వద్ద..

కారు దహనం చేసిన ఘటనలో మిగితా వారి గురించి గాలిస్తున్నట్లు పేర్కొన్నారు. కాగా క్యాంప్ కార్యాలయం వద్దకు వచ్చిన పోసానిపేట(Posanipet) మాజీ సర్పంచ్ కాంగ్రెస్ సీనియర్ నాయకుడు గీరెడ్డి మహేందర్ రెడ్డి ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అప్రమత్తమైన పోలీసులు అతన్ని అరెస్ట్ చేశారు. అనంతరం మహేందర్ రెడ్డి కారును బీజేపీ కార్యకర్తలు ధ్వంసం చేశారు. కారుకు నిప్పు పెట్టగా పోలీసులు మంటలను ఆర్పివేశారు.

ఉదయం నుంచి ఉద్రిక్తత..

కామారెడ్డి పట్టణంలోని ప్రభుత్వ కళాశాల(Kamareddy Government College) భూముల విషయంలో శనివారం ఉదయం నుంచి ఉద్రిక్తత నెలకొంది. ఎమ్మెల్యే కేవీఆర్​, ఎన్​ఎస్​యూఐ అధ్యక్షుడు ఐరేని సందీప్​ ఇరువురు స్థానిక శిశుమందిర్​కు వెళ్లేందుకు సిద్ధమయ్యారు. కళాశాల ఆస్తుల విషయంలో ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకోవడం.. పరిస్థితి చేయిదాటే పరిస్థితి రావడంతో కామారెడ్డి ఎస్పీ రాజేష్​చంద్ర ముందస్తుగా ఎమ్మెల్యే కేవీఆర్​ను ఇంట్లో నుంచి రావొద్దని కోరారు. దీంతో ఆయన ఇంట్లోనే ఉండిపోయారు. అనంతరం శిశుమందిర్​ వద్దకు వచ్చేందుకు ప్రయత్నించిన ఐరేని సందీప్​ను అదుపులోకి తీసుకుని అక్కడి నుంచి తరలించారు.

Hot this week

Trump tariff | మళ్లీ టెంపర్​ చూపిన ట్రంప్​.. 10 శాతం సుంకాన్ని 15 శాతానికి పెంపు!

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Trump tariff | అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్...

Cancer | స్టేజ్-1 లో గుర్తిస్తే క్యాన్సర్‌ను జయించడం తేలిక.. ఈ లక్షణాలు ఉన్నాయా..!

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Cancer | క్యాన్సర్ అనగానే మనలో చాలామంది భయపడతారు....

TG RERA Notices Builders | పలువురు బిల్డర్లు, డెవలపర్లకు రెరా నోటీసులు

అక్షరటుడే, వెబ్​డెస్క్ : TG RERA Notices Builders | నిబంధనలు...

Venkat Ramana Reddy Warning | నాపై ఈగ వాలినా సీఎందే బాధ్యత: ఎమ్మెల్యే వెంకట రమణారెడ్డి

అక్షరటుడే, కామారెడ్డి: Venkat Ramana Reddy Warning | తనపై ఈగ...

Topics

Trump tariff | మళ్లీ టెంపర్​ చూపిన ట్రంప్​.. 10 శాతం సుంకాన్ని 15 శాతానికి పెంపు!

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Trump tariff | అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్...

Cancer | స్టేజ్-1 లో గుర్తిస్తే క్యాన్సర్‌ను జయించడం తేలిక.. ఈ లక్షణాలు ఉన్నాయా..!

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Cancer | క్యాన్సర్ అనగానే మనలో చాలామంది భయపడతారు....

TG RERA Notices Builders | పలువురు బిల్డర్లు, డెవలపర్లకు రెరా నోటీసులు

అక్షరటుడే, వెబ్​డెస్క్ : TG RERA Notices Builders | నిబంధనలు...

Sevalal Maharaj Birth Anniversary | ఘనంగా సంత్ సేవాలాల్ మహరాజ్ జయంతి

అక్షరటుడే, ఎల్లారెడ్డి: Sevalal Maharaj Birth Anniversary | మహమ్మద్ నగర్...
spot_img

Related Articles

Popular Categories

spot_imgspot_img