ePaper
More
    Homeజిల్లాలుకామారెడ్డిKamareddy SP | వంద రోజులు, కీలక మార్పులు.. ఎస్పీ రాజేష్ చంద్ర మార్క్..

    Kamareddy SP | వంద రోజులు, కీలక మార్పులు.. ఎస్పీ రాజేష్ చంద్ర మార్క్..

    Published on

    అక్షరటుడే, కామారెడ్డి : Kamareddy SP | జిల్లా పోలీసు శాఖను గాడిలో పెట్టే దిశగా కామారెడ్డి ఎస్పీ రాజేష్​ చంద్ర (SP Rajesh Chandra) కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. ప్రజల్లో శాఖపై నమ్మకం పెంపొదించేందుకు కృషి చేస్తున్నారు. బాధ్యతలు చేపట్టిన కొద్ది రోజుల్లోనే అనేక మార్పులు తీసుకువచ్చారు. విధుల్లో నిర్లక్ష్యం వహించిన పోలీసులపై (Police) కఠినంగా వ్యవహరిస్తున్నారు. జిల్లా పోలీస్​ బాస్​గా రాజేష్​ చంద్ర బాధ్యతలు స్వీకరించి 100 రోజులు పూర్తయిన సందర్భంగా ‘అక్షరటుడే’తో ముచ్చటించారు. ఈ సందర్భంగా పలు విషయాలను పంచుకున్నారు.

    కామారెడ్డి జిల్లా ఎస్పీగా (Kamareddy District SP) బాధ్యతలు చేపట్టిన వంద రోజుల్లో పోలీస్ శాఖలో అనేక మార్పులు తీసుకువచ్చామని, పోలీసింగ్​పై ప్రజల్లో నమ్మకాన్ని కల్పించామని ఎస్పీ రాజేష్ చంద్ర తెలిపారు. జిల్లా పోలీసు శాఖను (district police department) గాడిలో పెట్టేందుకు నూతన అధ్యాయానికి శ్రీకారం చుట్టామని పేర్కొన్నారు. జిల్లాలో అన్ని పోలీస్ స్టేషన్లను (police stations) చుట్టేయడంతో పాటు స్టేషన్ల స్థితిగతులు, గ్రౌండ్ లెవల్ వివరాలు, పెండింగ్ కేసులు, పోలీసుల పనితీరును పరిశీలించినట్లు తెలిపారు. నిర్లక్ష్యంగా ఉండే సిబ్బందిపై కఠినంగా వ్యవహరిస్తున్నామని చెప్పారు.

    Kamareddy SP | మాదకద్రవ్యాలపై ఉక్కుపాదం

    జిల్లాలో రౌడీ షీటర్లకు కౌన్సిలింగ్ ఇచ్చాం. 19 మంది రౌడీ షీటర్లను (rowdy sheeters) గుర్తించాం. దొంగతనాలకు పాల్పడే వారిపై నిరంతర నిఘా కొనసాగిస్తున్నాం. గంజాయి అక్రమ రవాణాపై దృష్టి పెట్టాం. అల్ర్పాజోలం రవాణాపై ప్రత్యేక నిఘా ఉంచాం. నస్రుల్లాబాద్, గాంధారిలో కల్తీ కల్లు ఘటనల అనంతరం ప్రతి కల్లు డిపోపై నిరంతర నిఘా ఉంచాం. అల్ర్పాజోలం నిందితులు మళ్లీ పాత పద్ధతిలోనే వెళ్తున్నారన్న సమాచారం ఉంది. వారికి మళ్లీ కౌన్సిలింగ్ ఇస్తాం. వీరిని విడిపించేందుకు షూరిటీ ఇచ్చే వాళ్లను కూడా కట్టడి చేసే ప్రయత్నం చేస్తున్నాం.

    Kamareddy SP | అవినీతి ఆరోపణలు వస్తే చర్యలు

    పోలీసులపై ప్రజలకు నమ్మకం కల్పించే దిశగా అడుగులు వేశాం. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటూ.. విధి నిర్వహణలో అలసత్వం వహిస్తే చర్యలు తప్పవని సంకేతాలు పంపాం. ఇద్దరు ఎస్సైలపై సస్పెన్షన్ వేటు వేశాం. తాడ్వాయి ఎస్సై వెంకటేశ్వర్లును ఇతర జిల్లాకు బదిలీ చేశాం. హోంగార్డులు, కానిస్టేబుళ్లను సస్పెండ్ (home guards and constables Suspend) చేశాం. అదే సమయంలో మంచి పని చేసిన వారికి తగిన గుర్తింపు కూడా ఇచ్చాం. ఉత్తమ సేవలకు రివార్డులు అందజేశాం.

    Kamareddy SP | ఇసుక అక్రమ రవాణాకు అడ్డుకట్ట

    ఇసుక అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేసేలా ప్రత్యేక పాలసీ తీసుకువస్తున్నాం. పట్టుబడిన వాహనాన్ని అదే రోజు లేదా మరుసటి రోజు మైనింగ్, ఫారెస్ట్, ఆర్టీవో అధికారులకు (RTO officials) లేఖలు రాయాలని పోలీసు అధికారులకు చెప్పాం. మొదటి సారి పట్టుబడితే రూ.5 వేలు, రెండో సారి రూ.15 వేలు జరిమానా వేస్తున్నారు. మూడోసారి పట్టుబడితే సీజ్ చేస్తున్నారు. ఇటీవల ఒక క్వారీలో పట్టుబడిన వాహనానికి రూ.1.75 లక్షలు, జేసీబీకి రూ.98 వేలు, టిప్పర్​కు రూ.50 వేల ఫైన్ వేశారు.

    Kamareddy SP | గ్రామ పోలీసింగ్ వ్యవస్థను బలోపేతం చేస్తాం

    గ్రామాల్లో పోలీసింగ్ వ్యవస్థను మరింత బలోపేతం చేశాం. దీనిద్వారా గ్రామస్థులు కూడా అలర్ట్​గా ఉంటున్నారు. ఇటీవల ముగ్గురు దొంగలను ప్రజలే పట్టించారు. ఈ వ్యవస్థను ఇంకా పటిష్టం చేస్తాం.

    Kamareddy SP | 28 బ్లాక్ స్పాట్ల గుర్తింపు

    జిల్లాలో రోడ్డు ప్రమాదాల (road accidents) నివారణకు ప్రత్యేక చర్యలు చేపట్టాం. 28 బ్లాక్​ స్పాట్లను గుర్తించాం. ఉగ్రవాయి, పొందుర్తి వద్ద బారికేడ్స్ ఏర్పాటు చేశాం. ఫలితంగా ప్రమాదాలు తగ్గాయి. మూడు నెలలకు ఒకసారి ఒక అధికారి ఒక్కో బ్లాక్ స్పాట్​ను దత్తత తీసుకోవాలని సూచించాం. వారు అక్కడ కరెక్షన్స్ ఉంటే సరిచేస్తారు. ట్రాఫిక్ సమస్య పరిష్కారంపై ప్రత్యేక దృష్టి సారిస్తాం. జిల్లాకు ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ (traffic police station) మంజూరు కావాల్సి ఉంది.

    Kamareddy SP | ఎన్నికలపై ప్రత్యేక దృష్టి

    రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలపై ప్రత్యేక దృష్టి సారిస్తాం. ప్రతి గ్రామానికి సంబంధించి సమస్యలు సృష్టించే వారి వివరాలు స్టేషన్ ఎస్​హెచ్​వో (station SHO) వద్ద ఉండాలి. సాధారణ ఎన్నికల కంటే స్థానిక ఎన్నికలు (Local elections) క్లిష్టంగా ఉంటాయి. ఎన్నికలు, ఫలితాలు ఒకేరోజు వచ్చే అవకాశం ఉండడంతో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా చూస్తాం. ప్రజలు కూడా పోలీస్​ శాఖకు సహకరించాలి.

    Kamareddy SP | 18 కేసుల్లో తీర్పులు.. ఆరుగురికి జీవిత ఖైదు

    జిల్లాలో పెండింగ్ కేసులపై (pending cases) ప్రత్యేక దృష్టి పెట్టాం. ఛార్జీషీట్ దాఖలు, విచారణ ముమ్మరం చేశాం. నేను ఎస్పీగా వచ్చాక ఇప్పటికి 18 కేసుల్లో ఫైనల్ జడ్జిమెంట్ వచ్చింది. ఇందులో ఆరు కేసుల్లో నిదితులకు జీవిత ఖైదు, 12 కేసుల్లో పలువురు నిందితులకు పదేళ్లలోపు శిక్షలు పడ్డాయి. మొబైల్ ఫోన్ల రికవరీలో కమిషనరేట్లు మినహాయిస్తే రాష్ట్రంలో కామారెడ్డి జిల్లా (Kamareddy district) ప్రథమ స్థానంలో ఉంది.

    Kamareddy SP | ప్రతి వారం శిక్షణ.. క్రైం మీటింగ్

    జిల్లాలో పనిచేస్తున్న పోలీసు సిబ్బందికి ప్రతి వారం శిక్షణ ఇస్తున్నాం. సంబంధిత పోలీస్ స్టేషన్ ఎస్సై, సీఐ, డీఎస్పీలు సిబ్బందికి శిక్షణ ఇస్తారు. కేసుల ఛార్జీషీట్, విచారణ, ఇతర అంశాలపై క్షుణ్ణంగా వివరిస్తున్నాం. అలాగే ప్రతినెలా క్రైం మీటింగ్ (crime meeting) నిర్వహించి అన్ని అంశాలపై సూచనలు చేస్తున్నాం. పెండింగ్ కేసుల వివరాలు, వాటి పురోగతిపై సమీక్షిస్తున్నాం. జిల్లాలో కోర్టులో ఉన్న పెండింగ్ కేసులపై (pending cases) ప్రత్యేక దృష్టి పెట్టాం.

    Kamareddy SP | వందశాతం బదిలీలు పూర్తి చేశాం

    జిల్లాలో కొన్నేళ్లుగా ఒకే చోట పని చేస్తున్న పోలీస్ సిబ్బంది బదిలీలు పారదర్శకంగా నిర్వహించాం. ఒకే చోట పనిచేయడం వల్ల అనేక ఆరోపణలు వచ్చే అవకాశాలు ఉంటాయి. ఈ నేపథ్యంలో ఏఎస్సైలు, హోంగార్డులు, కానిస్టేబుళ్లు, డ్రైవర్లను కూడా బదిలీ చేశాం. 180 మందికి పైగా సిబ్బంది బదిలీలు పూర్తి చేశాం.

    Kamareddy SP | కారుణ్య నియామకాలు

    విధి నిర్వహణలో మృతి చెందిన పోలీస్ కుటుంబాలకు కారుణ్య నియామకాల్లో భాగంగా ఉద్యోగావకాశాలు (job opportunities) కల్పించాం. గాంధారి రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన కానిస్టేబుల్ రవి కుటుంబానికి 2 నెలల్లో ఉద్యోగం ఇప్పిస్తామని హామీ ఇచ్చాం. కేవలం 50 రోజుల్లోనే ఉద్యోగం కల్పించాం. పోలీస్ శాఖలో కాకుండా ఇతర శాఖలో ఉద్యోగం కల్పించాలని కోరే వారి ప్రక్రియ మాత్రమే పెండింగ్​లో ఉన్నాయి.

    Latest articles

    Today Gold Price | భారీగా పెరిగిన బంగారం, వెండి ధ‌ర‌లు.. ఈ రోజు ఎలా ఉన్నాయంటే..!

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Today Gold Price : బంగారం Gold, వెండి కొనుగోలుదారులకు మరో షాకింగ్ వార్త. ఆగస్టు 3,...

    Panchangam | శుభమస్తు.. నేటి పంచాంగం

    తేదీ(DATE) – 3 ఆగస్టు​ 2025శ్రీ విశ్వావసు నామ సంవత్సరం(Sri Vishwavasu Nama Sasra)విక్రమ సంవత్సరం(Vikrama Sasra) – 2081 పింగళ...

    PCC Chief | కేసీఆర్ పాలనలో చేసిన అప్పులు రూ. 8 లక్షలు.. పీసీసీ చీఫ్ వ్యాఖ్యలు.. సోషల్​ మీడియాలో ట్రోల్​

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: PCC Chief : తెలంగాణ ప్రదేశ్​ కాంగ్రెస్​ అధ్యక్షుడు మహేష్ కుమార్​ గౌడ్​ షాకింగ్​ గణాంకాలు...

    Uttar Pradesh | చంపి డ్రమ్​లో పాతిపెడతానన్న భార్య.. జడుసుకున్న భర్త..!

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Uttar Pradesh : ఉత్తరప్రదేశ్‌లో షాకింగ్ కేసు వెలుగు చూసింది. గోరఖ్‌పూర్ జిల్లా(Gorakhpur district)లో ఒక...

    More like this

    Today Gold Price | భారీగా పెరిగిన బంగారం, వెండి ధ‌ర‌లు.. ఈ రోజు ఎలా ఉన్నాయంటే..!

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Today Gold Price : బంగారం Gold, వెండి కొనుగోలుదారులకు మరో షాకింగ్ వార్త. ఆగస్టు 3,...

    Panchangam | శుభమస్తు.. నేటి పంచాంగం

    తేదీ(DATE) – 3 ఆగస్టు​ 2025శ్రీ విశ్వావసు నామ సంవత్సరం(Sri Vishwavasu Nama Sasra)విక్రమ సంవత్సరం(Vikrama Sasra) – 2081 పింగళ...

    PCC Chief | కేసీఆర్ పాలనలో చేసిన అప్పులు రూ. 8 లక్షలు.. పీసీసీ చీఫ్ వ్యాఖ్యలు.. సోషల్​ మీడియాలో ట్రోల్​

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: PCC Chief : తెలంగాణ ప్రదేశ్​ కాంగ్రెస్​ అధ్యక్షుడు మహేష్ కుమార్​ గౌడ్​ షాకింగ్​ గణాంకాలు...