అక్షరటుడే, కామారెడ్డి: CM Revanth Reddy | వరదలకు సంబంధించి అంచనాలను ప్రణాళికాబద్దంగా తయారు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Chief Minister Revanth Reddy) అధికారులను ఆదేశించారు.
పట్టణంలోని కలెక్టర్ కార్యాలయంలో (collector office) గురువారం జిల్లా అధికారులతో సమీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా శాఖల వారిగా వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం సీఎం మాట్లాడుతూ.. జిల్లాలో వరదల సమయంలో అన్ని శాఖల అధికారులు, పార్టీలకతీతంగా ప్రజాప్రతినిధుల సహకారంతో ప్రాణనష్టం, ఆస్తినష్టం, పశు సంపద నష్టం జరగకుండా కాపాడుకోగలిగామన్నారు. దీనికి అధికార యంత్రాంగాన్ని అభినందిస్తున్నట్టు తెలిపారు.
CM Revanth Reddy | సమన్వయంతో పని చేయాలి
సమస్యలు వచ్చినప్పుడు శాఖల మధ్య సమన్వయ లోపం స్పష్టం కనిపిస్తోందని సీఎం అభిప్రాయపడ్డారు. ఏ శాఖ వారు ఆ శాఖకు మాత్రమే పరిమితమవుతున్నారని దీంతో సమస్య పరిష్కారం కాదన్నారు. ఒక శాఖకు, మరొక శాఖకు మధ్య లింక్ ఉంటుందని, అలాంటప్పుడు శాఖల అధికారులు ఒకరికొకరు సమన్వయం చేసుకుని ముందుకు వెళ్తేనే సరైన పరిష్కారం లభిస్తుందన్నారు. శాఖలన్నింటినీ సమన్వయం చేసేందుకే కలెక్టర్లను ఏర్పాటు చేసుకున్నామని పేర్కొన్నారు. అధికారులు మాత్రం ఎవరికి వారుగానే ఉంటామంటే ఆ విషయం విపత్తులకు తెలియదన్నారు. అన్ని శాఖలతో సమన్వయం చేసుకునేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ను ఆదేశించారు.
CM Revanth Reddy | అలా చేస్తే యూరియా కొరత రాదు
టోకెన్ సిస్టం అమలు చేస్తే యూరియా కొరత రాదని సీఎం తెలిపారు. యూరియా (Urea) అందుబాటులో ఉన్నా అధికారుల ముందస్తు ప్రణాళిక లేకపోవడంతో రైతులు లైన్లలో బారులు తీరి ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. సమస్య వచ్చినప్పుడు రాజకీయాలకు అతీతంగా ముందుకు సాగాలని, మానవత్వంతో వ్యవహరించాలన్నారు. ప్రజల సమస్యల పరిష్కారం కోసమే తామందరం ఉన్న విషయాన్ని మర్చిపోవద్దన్నారు. విపత్తు మేనేజ్మెంట్లో కామారెడ్డి జిల్లా (Kamareddy District) మోడల్‌గా ఉండాలని, తన సూచనలు పకడ్బందీగా అమలు చేస్తే ఇతర జిల్లాల్లో అమలు చేసే అవకాశం ఉంటుందన్నారు.
CM Revanth Reddy | మళ్లీ సమీక్ష చేస్తా..
మళ్లీ తాను 15 రోజుల్లో సమీక్ష చేస్తానని సీఎం పేర్కొన్నారు. ఈ సమయంలో కేవలం కామారెడ్డి, ఎల్లారెడ్డి జిల్లాలకు మాత్రమే నిధులు ఇస్తున్నానని ఇతర ఎమ్మెల్యేలు అనుకోవద్దని, ఉమ్మడి జిల్లాల ఎమ్మెల్యేలతో ఇన్‌ఛార్జి మంత్రి సీతక్క (In-charge Minister Seethakka) సమీక్షించాలని సూచించారు. సమీక్షకు ఎంపీలు సురేష్ షెట్కార్, అర్వింద్‌లను కూడా ఆహ్వానించాలన్నారు. భవిష్యత్తులో వచ్చే వరదలు, విపతులను గుర్తించాలని, అందుకు అవసరమైన ప్రణాళిక తయారు చేయాలని సూచించారు. ఎమ్మెల్యేలు కూడా వారి నియజకవర్గాల్లో ఉన్న సమస్యలను ఇన్‌ఛార్జి మంత్రి దృష్టికి తీసుకెళ్లాలన్నారు. జిల్లా ఎమ్మెల్యేలు, కలెక్టర్లతో హైదరాబాద్ (Hyderabad) స్థాయిలో 10 రోజుల్లో సమీక్ష చేస్తానన్నారు. ఈ లోపు అధికారుల నివేదికలు కూడా వస్తాయన్నారు.
CM Revanth Reddy | నిధులు విడుదల చేస్తాం
నిధుల విడుదలకు ప్రభుత్వం సానుకూలంగా ఉంటుందని, వేగంగా నిధులను మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. కేంద్ర ప్రభుత్వం (central government) నుంచి ఎంత మేరకు వస్తే అంత రాబట్టుకోవాలన్నారు. అసెస్మెంట్, బిల్స్ రికార్డులు చేయాల్సి వస్తే కేవలం రాష్ట్ర ప్రభుత్వం దాంట్లోనే చేస్తున్నారని, కేంద్రం నుంచి ఎంత తీసుకోవడానికి ఆస్కారం ఉందో అంతమొత్తం రికార్డులో చేయాలని సీఎం పేర్కొన్నారు.
మిగతాది రాష్ట్ర ప్రభుత్వం (state government) ఇచ్చినట్లుగా చేయాలని సూచించారు. మంజూరు చేసేటప్పుడు ఒక ఫార్మాట్, బిల్ చేసేటప్పుడు ఒక ఫార్మాట్ తీసుకోవాలన్నారు. ఫ్లడ్ రిలీఫ్ ఫండ్ కేంద్ర ప్రభుత్వం ఎంత ఇచ్చినా ఏ అధికారి దానిని రికార్డు చేయలేకపోతున్నారన్నారు. అది తక్కువ ఉందని, ప్యారామీటర్ ఫిట్ కావడం లేదని పట్టించుకోవడం లేదన్నారు.
కేంద్ర ప్రభుత్వ నామ్స్ ప్రకారం పూర్తి రికార్డు బిల్ చేయాలని, ఒకవేళ కేంద్ర ప్రభుత్వం ఇవ్వకపోతే మొత్తం రాష్ట్ర ప్రభుత్వమే ఇస్తుందని, కేంద్రం నుంచి ఏ విధంగా రాబట్టుకోవాలో ప్రయత్నిస్తామని చెప్పారు. ఈ సమీక్షలో మంత్రులు సీతక్క, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్, ఎమ్మెల్యేలు మదన్ మోహన్ రావు, పోచారం శ్రీనివాస్‌రెడ్డి, సుదర్శన్ రెడ్డి, భూపతి రెడ్డి, ఎంపీ సురేష్ షెట్కార్, కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ (Collector Ashish Sangwa), ఎస్పీ రాజేష్ చంద్ర, ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు.