అక్షరటుడే, కామారెడ్డి : Shivaratri Celebrations | శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని ఆలయాలు భక్తుల తాకిడితో సందడిగా మారాయి. కామారెడ్డి (Kamareddy) నియోజకవర్గంలోని పలు ఆలయాలలో ఉదయం నుంచి భక్తుల రద్దీ నెలకొంది.
మద్దికుంట (Maddikunta) బుగ్గరామలింగేశ్వర స్వామి ఆలయం, భిక్కనూర్ సిద్ధరామేశ్వర ఆలయం, దోమకొండ గడికోట శివాలయం, బండరామేశ్వరపల్లి రామలింగేశ్వర ఆలయాలకు భక్తులు భారీగా తరలి వచ్చారు. స్వామివారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. ఉపవాసం ఉన్న భక్తులు సాయంత్రం పూట ఆలయాల్లో పూజలు చేసి, పండ్లు స్వీకరించారు.
బుగ్గరామలింగేశ్వర ఆలయంలో శివపార్వతుల కల్యాణం నిర్వహించారు. మాచారెడ్డి మాజీ ఎంపీపీ లోయపల్లి నర్సింగరావు, కామారెడ్డి సబ్ డివిజన్ ఏఎస్పీ చైతన్య రెడ్డి స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించారు. అనంతరం ఎస్పీ రాజేశ్చంద్ర (SP Rajesh Chandra) స్వామివారి రథాన్ని లాగి రథోత్సవాన్ని ప్రారంభించారు.

మద్దికుంటలో బారులు తీరిన భక్తులు

భిక్కనూరులో..
మద్దికుంటలో బారులు తీరిన భక్తులు
Shivaratri Celebrations | వెల్లుట్లపేటలో..
అక్షరటుడే, ఎల్లారెడ్డి: వెల్లుట్లపేటలోని శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయం వద్ద మహాశివరాత్రి వేడుకలు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. సర్పంచ్ కొయ్యల వినోద్ రాజా గౌడ్, ఉప సర్పంచ్ రాజు యాదవ్, సొసైటీ మాజీ వైస్ ఛైర్మన్ కొరివి ఎల్లప్ప, బంధం భూమయ్య, గాండ్ల సాయిరాం, నరేందర్, పెంట నవీన్, కొట్టాల నవీన్ పాల్గొన్నారు.

1 comment
[…] మంత్రి వెల్లడించారు. మహాశివరాత్రి (Mahashivratri) శుభ సందర్భంగా శాస్త్రవేత్తలు […]
Comments are closed.