అక్షరటుడే, కామారెడ్డి: All India Kisan Congress | కామారెడ్డి మున్సిపాలిటీ పరిధిలోని దేవునిపల్లి (Devunipally) గ్రామానికి చెందిన కాంగ్రెస్ నాయకుడు నీలం రమేష్‌కు ఆల్ ఇండియా కిసాన్ కాంగ్రెస్ కీలక బాధ్యతలు అప్పగించింది.
దేశంలో ఓట్ చోరీ జరిగిందని రాహుల్ గాంధీ (Rahul Gandhi) ఆరోపణలు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ అంశంపై రాహుల్ గాంధీ చేపట్టిన కార్యక్రమం సెప్టెంబర్ 1న పాట్నాలో ముగియనుంది.
దీంతో ఆల్ ఇండియా కిసాన్ కాంగ్రెస్ నేషనల్ కో–ఆర్డినేటర్‌గా ఉన్న నీలం రమేష్‌కు పాట్నాలో (Patna) జరిగే ఓటర్ అధికార్ ర్యాలీ (Voter Adhikar Rally) ఇన్ఛార్జీగా నియమిస్తూ ఆ పార్టీ వైస్ ఛైర్మన్ అఖిలేష్ శుక్లా ఉత్తర్వులు జారీ చేశారు.
నీలం రమేష్ గతంలో వైఎస్సాఆర్‌టీపీలో కొనసాగారు. వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలకు (YS Sharmila) నీలం రమేష్ నమ్మకస్తుడిగా ఉన్నారు. షర్మిలకు సంబంధించి పాదయాత్ర, ర్యాలీలు ఇతర కార్యక్రమాలను నీలం రమేష్ పర్యవేక్షించనున్నారు. ప్రస్తుతం ఆయనకు పాట్నా బాధ్యతలు అప్పగించినందుకు ఆల్ ఇండియా కిసాన్ కాంగ్రెస్ కమిటీకి కృతజ్ఞతలు తెలిపారు. తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని రమేష్ తెలిపారు.