అక్షరటుడే, కామారెడ్డి : Kamareddy Reservations | రాష్ట్ర ప్రభుత్వం 42 శాతం బీసీ రిజర్వేషన్ కోసం జీవో విడుదల చేయడంతో స్థానిక సంస్థల ఎన్నికల హడావుడి మొదలైంది.
అయితే, శనివారం (సెప్టెంబరు 27) ఉదయం నుంచి రిజర్వేషన్లు Reservations ఇవే అంటూ సామాజిక మాధ్యమాల్లో విపరీతంగా వైరల్ అయ్యాయి.
కాగా, సాయంత్రం జిల్లాలోని 25 మండలాలకు సంబంధించిన ఎంపీపీ, జడ్పీటీసీ రిజర్వేషన్ల డ్రా ప్రక్రియను పలు రాజకీయ పార్టీల నాయకుల సమక్షంలో కామారెడ్డి కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ డ్రా పద్ధతిలో ఖరారు చేశారు.
ఈ నేపథ్యంలో ఆశావహుల్లో ఆశలు చిగురించాయి. ఆయా స్థానాల్లో రిజర్వేషన్లు కలిసి వచ్చిన వారు పార్టీ టికెట్‌పై ఎమ్మెల్యేల వద్దకు పరుగులు పెడుతున్నారు.
కాగా, మరికొందరు నిరాశలో ఉండిపోయారు. ఎందుకంటే వారి ప్రాంతాల స్థానాలను వేరే కేటగిరీకి కేటాయించడంతో ఈ పరిస్థితి ఏర్పడింది. దీనిపై మల్లగుల్లాలు పడుతున్నారు.
మార్పించుకునే అవకాశం ఏమైనా ఉందా.. అంటూ ఆరా తీస్తున్నారు. వీరు కూడా స్థానిక ఎమ్మెల్యేల భేటీ అయ్యేందుకు అవకాశం కోసం ఎదురుచూస్తున్నారు.
Kamareddy Reservations | మహిళలకు 50 శాతం..
అధికారిక రిజర్వేషన్ల జాబితాను శనివారం రాత్రి అధికారులు వెల్లడించారు. కామారెడ్డి జిల్లాలోని 25 మండలాలలో మొత్తంగా చూస్తే మహిళలకు ఎంపీపీ స్థానాలలో 13, జడ్పీటీసీ స్థానాలలో 12 కేటాయించారు. అంటే మొత్తంగా మహిళలకు 50 శాతం రిజర్వేషన్ కల్పించారు.
కేటగిరీల వారీగా ఇలా..
- ఎంపీపీ స్థానాల్లో బీసీ జనరల్ 6 స్థానాలు, జడ్పీటీసీ స్థానాల్లో 6 స్థానాలు కేటాయించారు.
- బీసీ మహిళకు ఎంపీపీ 5 స్థానాలు, జడ్పీటీసీ 5 స్థానాలు ఖరారు చేశారు.
- జనరల్ మహిళ విషయానికి వస్తే.. ఎంపీపీ 4 స్థానాలు, జడ్పీటీసీ 4 స్థానాలు కేటాయించారు.
- జనరల్ తీసుకుంటే.. ఎంపీపీ 4 స్థానాలు, జడ్పీటీసీ 4 స్థానాలు ఖరారు చేశారు.
- ఎస్సీ మహిళ కేటగిరీలో ఎంపీపీ MPP 2 స్థానాలు, జడ్పీటీసీ 2 స్థానాలు కేటాయించడం గమనార్హం.
- ఎస్సీ జనరల్ తీసుకుంటే.. ఎంపీపీ 2 స్థానాలు, జడ్పీటీసీ ZPTC 2 స్థానాలు ఖరారు చేశారు.
- ఇక ఎస్టీ మహిళకు ఎంపీపీ 1, జడ్పీటీసీ 1 కేటాయించారు.
- ఎస్టీ జనరల్ కేటగిరీలో ఎంపీపీ 1, జడ్పీటీసీ 1 స్థానం రిజర్వేషన్లు ఖరారు చేశారు.
మండలాల వారీగా పరిశీలిస్తే..
- బాన్సువాడ ఎంపీపీ – బీసీ జనరల్, జడ్పీటీసీ బీసీ జనరల్
- భిక్కనూరు – ఎంపీపీ బీసీ జనరల్, జడ్పీటీసీ బీసీ జనరల్
- బీబీపేట – ఎంపీపీ బీసీ మహిళ, జడ్పీటీసీ బీసీ మహిళ
- బిచ్కుంద – ఎంపీపీ జనరల్ మహిళ, జడ్పీటీసీ జనరల్
- బీర్కూరు – ఎంపీపీ మహిళ, జడ్పీటీసీ జనరల్
- దోమకొండ – ఎంపీపీ జనరల్, జడ్పీటీసీ జనరల్ మహిళ
- డొంగ్లీ – ఎంపీపీ ఎస్సీ మహిళ, జడ్పీటీసీ ఎస్సీ మహిళ
- గాంధారి – ఎంపీపీ బీసీ జనరల్, జడ్పీటీసీ బీసీ మహిళ
- జుక్కల్ – ఎంపీపీ ఎస్సీ జనరల్, జడ్పీటీసీ ఎస్సీ జనరల్
- కామారెడ్డి – ఎస్సీ మహిళ, జడ్పీటీసీ ఎస్సీ జనరల్
- లింగంపేట – ఎంపీపీ బీసీ జనరల్, జడ్పీటీసీ బీసీ జనరల్
- మాచారెడ్డి – ఎంపీపీ ఎస్టీ మహిళ, జడ్పీటీసీ ఎస్టీ మహిళ
- మద్నూర్ – ఎంపీపీ బీసీ జనరల్, జడ్పీటీసీ బీసీ జనరల్
- మహమ్మద్ నగర్ – బీసీ మహిళ, జడ్పీటీసీ బీసీ మహిళ
- నాగిరెడ్డిపేట – ఎంపీపీ ఎస్సీ జనరల్, జడ్పీటీసీ ఎస్సీ మహిళ
- నసురుల్లాబాద్ – ఎంపీపీ జనరల్ మహిళ, జడ్పీటీసీ జనరల్,
- నిజాంసాగర్ – ఎంపీపీ బీసీ జనరల్, జడ్పీటీసీ బీసీ మహిళ
- పాల్వంచ – ఎంపీపీ బీసీ మహిళ, జడ్పీటీసీ బీసీ జనరల్
- పెద్ద కొడప్గల్ – ఎంపీపీ బీసీ మహిళ, జడ్పీటీసీ బీసీ జనరల్
- పిట్లం – ఎంపీపీ జనరల్, జడ్పీటీసీ జనరల్ మహిళ
- రాజంపేట – ఎంపీపీ ఎస్టీ జనరల్, జడ్పీటీసీ ఎస్టీ జనరల్
- రామారెడ్డి – ఎంపీపీ బీసీ మహిళ, జడ్పీటీసీ బీసీ మహిళ
- సదాశివనగర్ – ఎంపీపీ జనరల్, జడ్పీటీసీ జనరల్ మహిళ
- తాడ్వాయి – ఎంపీపీ జనరల్ మహిళ, జడ్పీటీసీ జనరల్
- ఎల్లారెడ్డి – ఎంపీపీ జనరల్, జడ్పీటీసీ జనరల్ మహిళ