అక్షరటుడే, కామారెడ్డి: Municipal Elections | జిల్లాలోని నాలుగు మున్సిపాలిటీలలో వార్డుల వారీగా రిజర్వేషన్లపై మూడు రోజుల ఉత్కంఠకు తెరపడింది. వార్డుల వారీగా శనివారం తుది జాబితాను అధికారులు విడుదల చేశారు. కామారెడ్డి, ఎల్లారెడ్డి, బాన్సువాడ, బిచ్కుంద మున్సిపాలిటీలలో రిజర్వేషన్ల ప్రక్రియ ముగిసింది.
Municipal Elections | కామారెడ్డి మున్సిపాలిటీలో..
కామారెడ్డి మున్సిపాలిటీలో (Kamareddy municipality) 49 వార్డుల్లో 16 వార్డులు జనరల్, 13 వార్డులలో జనరల్ మహిళ, 11 వార్డులలో బీసీ జనరల్, 8 వార్డులలో బీసీ మహిళ, 2 వార్డులలో ఎస్సీ జనరల్, 2 వార్డులలో ఎస్సీ మహిళ ఒక వార్డులో ఎస్టీకి కేటాయించారు. ఎల్లారెడ్డి మున్సిపాలిటీలో 12 వార్డులకు 2 జనరల్, 4 జనరల్, 2 బీసీ జనరల్, 1 బీసీ మహిళ, 1ఎస్సీ జనరల్, 1 ఎస్సీ మహిళ, 1 ఎస్టీ జనరల్ స్థానాలకు కేటాయించారు.
Municipal Elections | బాన్సువాడ మున్సిపాలిటీలో..
బాన్సువాడ మున్సిపాలిటీలో (Banswada municipality) 19 వార్డులలో 5 వార్డులు జనరల్, 5 జనరల్ మహిళ, 4 బీసీ జనరల్, 2 బీసీ మహిళ, 1 ఎస్సీ జనరల్, 1 ఎస్సీ మహిళ, 1 ఎస్టీ జనరల్ కు కేటాయించారు. బిచ్కుంద మున్సిపాలిటీలో (Bichkunda Municipality) 12 వార్డులకు 2 జనరల్, 5 జనరల్ మహిళ, 2 బీసీ జనరల్, 1 బీసీ మహిళ, 1 ఎస్సీ జనరల్, 1 ఎస్టీ జనరల్‌కు కేటాయించారు. మున్సిపాలిటీలలో వార్డుల వారిగా రిజర్వేషన్లు ఇలా ఉన్నాయి.
Municipal Elections | బిచ్కుంద మున్సిపాలిటీలో..
1వ వార్డు ఎస్సీ జనరల్, 2వ వార్డు జనరల్, 3,4,5,11,12వ వార్డులు జనరల్ మహిళకు కేటాయించారు. 8, 9వ వార్డులు బీసీ జనరల్‌కు, 6వ వార్డు ఎస్టీ జనరల్, 7వ వార్డు జనరల్‌కు, 10వ వార్డు బీసీ మహిళకు కేటాయించారు.
Municipal Elections | కామారెడ్డి మున్సిపాలిటీలో వార్డుల వారీగా..
1, 3, 8, 9, 18, 19, 28, 29, 31, 33, 39, 46వ వార్డులు జనరల్‌కు కేటాయించారు. 4, 6,17, 36, 24, 25, 37, 43,45 49వ వార్డులు బీసీ జనరల్‌కు కేటాయించారు. 5, 10, 11, 12, 21, 22, 23, 27, 30, 35, 41, 42, 44వ వార్డులు జనరల్ మహిళకు కేటాయించారు. 7, 14, 15, 16, 34, 38, 40, 47, 48వ వార్డులను బీసీ మహిళకు కేటాయించారు. 13, 20వ వార్డు ఎస్సీ మహిళకు, 2వ వార్డు ఎస్టీ జనరల్‌కు, 26, 32వ వార్డులను ఎస్సీ జనరల్‌కు కేటాయించారు.
Municipal Elections | ఎల్లారెడ్డి మున్సిపాలిటీలో వార్డులు..
1, 2, 4, 7వ వార్డులు జనరల్ మహిళకు కేటాయించారు. 3వ వార్డు బీసీ మహిళకు, 9, 10 వార్డులను బీసీ జనరల్‌కు, 6, 8వ వార్డులను జనరల్‌కు, 5వ వార్డు ఎస్సీ జనరల్‌కు, 11వ వార్డు ఎస్సీ మహిళకు, 12వ వార్డును ఎస్టీ జనరల్‌కు రిజర్వ్ చేశారు.
Municipal Elections | బాన్సువాడ మున్సిపాలిటీ వార్డులు..
1, 5, 6, 9, 14వ వార్డులను జనరల్ మహిళలకు కేటాయించారు. 2, 15, 19వ వార్డులు బీసీ జనరల్‌కు రిజర్వ్ చేశారు. 3, 11, 12, 13, 16వ వార్డులు జనరల్‌కు ఇచ్చారు. 4వ వార్డు ఎస్సీ జనరల్‌కు, 7వ వార్డు బీసీ మహిళకు, 8వ వార్డు ఎస్సీ మహిళకు, 10వ వార్డు ఎస్టీ జనరల్, 17వ, 18వ వార్డులు బీసీ మహిళలకు రిజర్వ్ చేశారు.