ePaper
More
    Homeఆంధ్రప్రదేశ్​Sp Rajesh Chandra | మొబైల్స్ రికవరీలో ప్రథమ స్థానంలో కామారెడ్డి

    Sp Rajesh Chandra | మొబైల్స్ రికవరీలో ప్రథమ స్థానంలో కామారెడ్డి

    Published on

    అక్షరటుడే, కామారెడ్డి: Sp Rajesh Chandra | మొబైల్స్ రికవరీలో కమిషనరేట్లు మినహాయిస్తే.. కామారెడ్డి జిల్లా ప్రథమ స్థానంలో నిలిచిందని జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర తెలిపారు. జిల్లాలో ఇప్పటివరకు 3,150 ఫోన్లు రికవరీ చేశామని స్పష్టం చేశారు.

    పలువురు పోగొట్టుకున్న రూ.15లక్షల విలువైన 107 మొబైల్స్ వివిధ ప్రాంతాల నుంచి స్వాధీనం చేసుకున్న ఫోన్లను బుధవారం జిల్లా పోలీసు కార్యాలయంలో (District Police Office) ప్రదర్శించారు.

    ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. సెల్​ఫోన్లను అశ్రద్ధ చేస్తే వ్యక్తిగత, సామాజిక భద్రతకు భంగం కలుగుతుందన్నారు. మొబైల్ పోయినా, చోరీకి గురైనా వెంటనే సంబంధిత పోలీస్​స్టేషన్​కు (police station) వెళ్లి దరఖాస్తు ఇవ్వాలని, సిమ్ కార్డ్ బ్లాక్ చేసి అదే నంబర్​తో కొత్తసిమ్​ తీసుకోవాలని సూచించారు. ఫోన్ పోతే ఆందోళన చెందవద్దని, సీఈఐఆర్ (CEIR) ద్వారా ఫోన్ రికవరీ చేయవచ్చన్నారు. ఈ సందర్భంగా 107 మొబైల్ ఫోన్ల రికవరీ చేయడంలో ప్రతిభ చూపిన టీం సభ్యులను ఎస్పీ అభినందించారు.

    More like this

    Nara Lokesh | పార్టీలకతీతంగా సాయం చేస్తున్న నారా లోకేష్.. వైఎస్సార్‌సీపీ కార్యకర్త అడిగిన వెంట‌నే సాయం

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Nara Lokesh | ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేష్ తన సోషల్ మీడియా యాక్టివిటీతో...

    Maoists Surrender | లొంగిపోయిన మావోయిస్ట్​ కీలక నేత సుజాతక్క

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Maoists Surrender | మావోయిస్టులకు మరో ఎదురుదెబ్బ తగిలింది. పార్టీ కీలక నేత సుజాతక్క...

    Telangana | ఇవేం పాలి”ట్రిక్స్‌”? ఫిరాయింపుల‌పై జ‌నం చీద‌రింపులు

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Telangana | పార్టీ ఫిరాయింపుల ప‌ర్వం ఇప్పుడు రాష్ట్రంలో కొత్త చ‌ర్చ‌కు దారి తీసింది....