అక్షరటుడే, కామారెడ్డి: Police Service Medal | రాష్ట్ర ప్రభుత్వం కొత్త ఏడాది సందర్భంగా పోలీస్ శాఖలో అత్యుత్తమ సేవలందించిన అధికారులకు ఉత్తమ సేవా పతకాలు (Best Service Medals), సేవా పతకాలు ప్రకటించింది. ఈ జాబితాలో కామారెడ్డి జిల్లాకు (Kamareddy district) చెందిన ఏడుగురు పోలీసు అధికారులు కూడా ఉన్నారు.
Police Service Medal | సేవా పతకాలు పొందింది వీరే..
ఉత్తమ సేవా పతకానికి తాడ్వాయి ఏఎస్సై రవీందర్ కుమార్ (Tadwai ASI Ravinder Kumar), కామారెడ్డి ఏఆర్ హెడ్ కానిస్టేబుల్ జై హరికిషన్ ఎంపిక కాగా సేవా పతకం కింద బాన్సువాడ ఎస్సై మోహన్, సీసీఎస్ ఏఎస్సై నర్సింగరావు, ఏఆర్ ఎస్సై దామోదర్ రెడ్డి, కామారెడ్డి ఏఆర్ హెడ్ కానిస్టేబుల్ విఠల్ రెడ్డి, కామారెడ్డి పట్టణ పోలీస్ స్టేషన్ హెడ్ కానిస్టేబుల్ దత్తయ్య ఎంపికయ్యారు.
Police Service Medal | ప్రత్యేకంగా అభినందనలు..
ఈ సందర్భంగా ఎస్పీ రాజేష్ చంద్ర (SP Rajesh Chandra) శనివారం రాష్ట్ర స్థాయి పురస్కారాలకు ఎంపికైన పోలీస్ అధికారులు, సిబ్బందిని స్వయంగా జిల్లా పోలీస్ కార్యాలయానికి ఆహ్వానించి అభినందించారు. అనంతరం మాట్లాడుతూ.. కామారెడ్డి జిల్లాలో పోలీస్ అధికారులు, సిబ్బంది విధి నిర్వహణలో నిబద్ధతతో పనిచేస్తున్నారన్నారు. వారి సేవలను గుర్తించి రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర స్థాయి పురస్కారాలు ప్రకటించడం జిల్లాకు గర్వకారణమని పేర్కొన్నారు. ఈ పురస్కారాలు పోలీస్ శాఖలోని ప్రతి ఒక్కరికి మరింత ఉత్సాహాన్ని కలిగిస్తాయని తెలిపారు. జిల్లాలో పనిచేస్తున్న అధికారులు, సిబ్బంది విధి నిర్వహణలో మరింత నిబద్ధతతో పనిచేసి ఇలాంటి పురస్కారాలకు అర్హులవ్వాలని సూచించారు.