అక్షరటుడే, కామారెడ్డి: Polling Percentage | ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో పోలింగ్ కొనసాగుతోంది. ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. అధికారులు పోలింగ్ సరళిని పరిశీలిస్తున్నారు. అలాగే ఉన్నతాధికారులు క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ పరిస్థితి తెలుసుకుంటున్నారు. కాగా.. పోలింగ్ శాతం పెరిగింది.
Polling Percentage | నిజామాబాద్ జిల్లాలో..
నిజామాబాద్ జిల్లాలో నిజామాబాద్ నగరపాలక సంస్థతోపాటు మూడు మున్సిపాలిటీలో కలిపి మధ్యాహ్నం ఒంటి గంటల వరకు 39.68 శాతం ఓటింగ్ నమోదైంది. నిజామాబాద్ కార్పొరేషన్లో 35.49 శాతం ఆర్మూర్‌లో 47.93 శాతం, బోధన్‌లో 50.69 శాతం, భీమ్‌గల్‌లో 51.53 శాతం ఓటింగ్ నమోదైంది. కాగా తొలి రెండు గంటల్లో ఓటింగ్ శాతం తక్కువగా నమోదైనా.. తర్వాత కాస్త పుంజుకుంది. జిల్లావ్యాప్తంగా 4,95,485 మంది ఓటర్లు ఉండగా.. ఇప్పటివరకు 1,96,606 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.
కామారెడ్డి జిల్లాలో..
కామారెడ్డి జిల్లాలో మున్సిపల్ ఎన్నికల పోలింగ్ శాతం పెరిగింది. జిల్లాలో ఉదయం 11 గంటల వరకు 26.86 శాతం పోలింగ్ నమోదైన పోలింగ్ మధ్యాహ్నం ఒంటి గంట వరకు 47.13 శాతానికి చేరింది. జిల్లాలో నాలుగు మున్సిపాలిటీలలో 1,49,525 మంది ఓటర్లు ఉండగా మధ్యాహ్నం ఒంటి గంట వరకు 40,159 మంది ఓటుహక్కు వినియోగించుకోగా 47.13 శాతం పోలింగ్ నమోదైంది. కామారెడ్డి మున్సిపాలిటీలో 99,313 మంది ఓటర్లకు 43,486 మంది ఓటు వేయగా 43.79 శాతం, ఎల్లారెడ్డిలో 13,265 మంది ఓటర్లకు 7,020 మంది ఓటుహక్కు వినియోగించుకోగా 52.92 శాతం నమోదైంది. బాన్సువాడలో 24,188 మంది ఓటర్లకు 12,217 మంది ఓటుహక్కు వినియోగించుకోగా 50.51 శాతం, బిచ్కుంద మున్సిపాలిటీలో 12,789 మంది ఓటర్లకు 7,741 మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోగా 60.69 పోలింగ్ శాతం నమోదైంది. నాలుగు మున్సిపాలిటీల్లో బిచ్కుంద మున్సిపాలిటీ పోలింగ్ శాతంలో మొదటి స్థానంలో ఉండగా ఎల్లారెడ్డి, బాన్సువాడ మున్సిపాలిటీలలో 50 శాతం దాటింది. కామారెడ్డిలో మాత్రం 43.79 శాతం నమోదైంది.
పోలింగ్ కేంద్రాలను పరిశీలించిన కలెక్టర్, ఎస్పీ
జిల్లాలో జరుగుతున్న మున్సిపల్ ఎన్నికల తీరును కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్, ఎస్పీ రాజేష్ చంద్ర పరిశీలించారు. కామారెడ్డి పట్టణంలోని డ్రైవర్స్ కాలనీ, హరిజనవాడ, గొల్లవాడ, బాయ్స్ హై స్కూల్, ఆర్బీనగర్, దేవునిపల్లి, లింగాపూర్ పోలింగ్ కేంద్రాలను తనిఖీ చేశారు. అలాగే ఎల్లారెడ్డి, బాన్సువాడలోని పోలింగ్ కేంద్రాలు, కౌంటింగ్ సెంటర్‌ను పరిశీలించారు. అధికారులకు పలు సూచనలు చేశారు. ఎన్నికల సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా చూడాలని అధికారులను ఆదేశించారు.
1 comment
[…] జీహెచ్ఎంసీలో వార్డులు, జోన్లు ఇవే.. Polling Percentage | నిజామాబాద్ జిల్లాలో 39.68 శాతం, … CP checks polling pattern | పోలింగ్ సెంటర్లలో […]
Comments are closed.