అక్షరటుడే, కామారెడ్డి: Kamareddy Municipality Water Issue | కామారెడ్డి పట్టణంలో (Kamareddy City) వేసవిలో తాగునీటి సమస్య రానివ్వమని మున్సిపల్ ఛైర్మన్ ఇప్ప ఉమారాణి (Municipal Chairman Ippa Umarani) తెలిపారు. బుధవారం ఆమె మున్సిపల్ కమిషనర్, కౌన్సిలర్లతో కలిసి బుర్రమత్తడి ఫిల్టర్ బెడ్ పనులను పరిశీలించారు. ఫిల్టర్ బెడ్ల (Filter beds) పనితీరును అధికారులు అడిగి తెలుసుకున్నారు.
Kamareddy Municipality Water Issue | అధికారులకు ఆదేశాలు..
పనులు త్వరగా పూర్తి చేసి ప్రజలకు నీటి ఇబ్బంది కలుగకుండా చర్యలు తీసుకోవాలని ఉమారాణి అధికారులను ఆదేశించారు. తాగునీటి ఎద్దడి తలెత్తకుండా యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకోవాలన్నారు. బుర్రమత్తడి వద్ద ప్రస్తుతం ఉన్న వనరులకు అదనంగా మరో మూడు కొత్త బోర్లు వేయించాలని, వీటికి అంతరాయం లేని విద్యుత్ సరఫరా కోసం ప్రత్యేకంగా ట్రాన్స్ఫార్మర్ల ఏర్పాటు చేయాలని మున్సిపల్ (Kamareddy Municipality) కమిషనర్ రాజేందర్ రెడ్డి, ఏఈ వేణు ప్రసాద్‌లకు ఆదేశాలు జారీ చేశారు.
ముఖ్యంగా ఫిల్టర్ బెడ్ల వద్ద పరిశుభ్రత విషయంలో రాజీ పడకూడదని, ప్రజలకు స్వచ్ఛమైన నీటిని అందించాలని ఛైర్మన్ సూచించారు. ప్రతి ఇంటికి తాగునీరు సక్రమంగా అందేలా అధికారులు నిరంతరం పర్యవేక్షించాలని కోరారు. వేసవి ప్రణాళికలో ఏవైనా లోపాలు ఉంటే సహించేది లేదని ఆమె హెచ్చరించారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ రాజేందర్ రెడ్డి, ఏఈ వేణు ప్రసాద్‌లతో పాటు మున్సిపల్ కౌన్సిలర్లు పాల్గొన్నారు.