అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Pulwama Alert | జమ్మూ కశ్మీర్ (Jammu and Kashmir)లోని పుల్వామాలో బలగాలు హై అలెర్ట్ ప్రకటించాయి. పుల్వామా ఉగ్రదాడికి నేటితో ఏడేళ్లు పూర్తయ్యాయి. దీంతో పోలీసులు, సైన్యం అప్రమత్తమైంది.
పుల్వామాలో 2019 ఫిబ్రవరి 14న ఉగ్రదాడిలో 40 మంది సీఆర్పీఎఫ్ సిబ్బంది చనిపోయిన విషయం తెలిసిందే. పాకిస్తాన్‌కు చెందిన జైష్-ఎ-మొహమ్మద్ ఉగ్రవాది సీఆర్పీఎఫ్ కాన్వాయ్ (CRPF Convoy)పై ఆత్మాహుతి దాడి చేశారు. జమ్మూ శ్రీనగర్ జాతీయ రహదారిపై 2,500 మందికి పైగా సిబ్బందితో కూడిన 78 వాహనాల కాన్వాయ్‌పై వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. దీంతో ప్రతి ఏడాది అమరవీరులను స్మరించుకోవడానికి, వారి త్యాగాన్ని గౌరవించడానికి ఫిబ్రవరి 14ను బ్లాక్ డేగా పాటిస్తారు.
Pulwama Alert | ప్రధాని నివాళులు
పుల్వామా అమరులకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (PM Narendra Modi) శనివారం నివాళులర్పించారు. దేశానికి వారి సేవ ప్రజల స్పృహలో నిలిచి ఉంటుందన్నారు. వారి అంకితభావం, సంకల్పం, దేశ సేవ శాశ్వతంగా నిలిచిపోతాయన్నారు.
Pulwama Alert | శ్రీనగర్‌లో సోదాలు
ఈ విషాద ఘటన తర్వాత భద్రతా ఏర్పాట్లు కఠినతరం చేశారు. దాడి తర్వాత జమ్మూ కాశ్మీర్ వంటి సున్నితమైన ప్రాంతాలలో భద్రతా దళాల మోహరింపును పెంచింది. దాడి జరిగి ఏడేళ్లవుతున్న సందర్భంగా శుక్రవారం నుంచి కశ్మీర్ పోలీసులు (Kashmir Police) శుక్రవారం నుంచి శ్రీనగర్, ఇతర ప్రదేశాలలోని రద్దీ ప్రాంతాలలో ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తున్నారు. లాల్ చౌక్‌లో సైతం సోదాలు చేశారు. అనేక హోటళ్లలోకి వెళ్లి పరిశీలించారు. గదులను తనిఖీ చేసి, అతిథుల సామగ్రిని సైతం పరిశీలించారు. కాగా పుల్వామా దాడి అనంతరం 2019 ఫిబ్రవరి 26న భారత్ బాలాకోట్ సమీపంలో వైమానిక దాడిని నిర్వహించింది.