అక్షరటుడే, కామారెడ్డి: Kamareddy Municipal Elections | కామారెడ్డి మున్సిపాలిటీ (Kamareddy Municipality) ఎన్నికల ఫలితాలు ఉత్కంఠ రేపాయి. ఛైర్మన్‌గా ప్రచారం సాగిన అభ్యర్థుల వార్డుల్లోనే ఓటమి పాలువ్వడం, అక్కడ బీజేపీ అభ్యర్థి గెలవడం హాట్ టాపిక్‌గా మారింది. ఏ పార్టీకి స్పష్టమైన ఆధిక్యత రాకపోవడంతో ఛైర్మన్ పీఠం దక్కేదెవరికోనని ప్రజలు చర్చించుకుంటున్నారు.
Kamareddy Municipal Elections | అధికార పార్టీకి దెబ్బ..
సాయంత్రం 4 గంటల సమయానికి కాంగ్రెస్ పార్టీ 19, బీజేపీ 16, బీఆర్ఎస్ 11, స్వతంత్ర అభ్యర్ధులు 3 స్థానాల్లో గెలుపొందారు. మొదటి రౌండ్లో 32 వార్డులలో కాంగ్రెస్ 13, బీజేపీ 11, బీఆర్ఎస్ 5 స్థానాలు, స్వతంత్ర అభ్యర్ధులు రెండు స్థానాల్లో గెలవగా రెండవ రౌండ్లో 17 వార్డుల్లో కాంగ్రెస్ 6, బీజేపీ 5, బీఆర్ఎస్ 6, స్వతంత్ర అభ్యర్థి ఒక స్థానంలో గెలుపొందారు. అధికార పార్టీలో గెలుపు పక్కా అనుకున్న స్థానాల్లో భారీ ఓటమి చవిచూడటం చర్చనీయాంశంగా మారాయి. మరోవైపు బీజేపీ(Kamareddy BJP) 16 స్థానాలు గెలవడం, బీఆర్ఎస్ సైతం 11 స్థానాలు దక్కించుకోవడం చర్చనీయాంశంగా మారాయి. దాంతో కామారెడ్డి మున్సిపాలిటీని ఏ పార్టీ దక్కించుకోబోతుందన్న చర్చ సాగుతోంది.
గెలిచిన అభ్యర్థులు వీరే..
1 వ వార్డు గడ్డమీది మహేష్ (కాంగ్రెస్), 2వ వార్డు ధరావత్ మోతిలాల్ (కాంగ్రెస్), 3వ వార్డు షేక్ బబ్లూ (స్వతంత్ర), 4వ వార్డు షేక్ జావీద్ (కాంగ్రెస్), 5వ వార్డు తహసీన్ మున్నిసా, (కాంగ్రెస్), 6వ వార్డు నిట్టు గంగాధర్(కాంగ్రెస్), 7వ వార్డు ఫరీన్ కాతూన్ (బీఆర్ఎస్), 8వ వార్డు శ్రీధర్ రెడ్డి (బీజేపీ), 9వ వార్డు బండారి నరేందర్ రెడ్డి(బీజేపీ), 10వ వార్డు కాసర్ల మాధవి (బీజేపీ), 11వ వార్డు కాసర్ల రాణి (బీజేపీ), 12వ వార్డు కాసర్ల గోదావరి(బీఆర్ఎస్), 13వ వార్డు కొత్తపల్లి లలిత (కాంగ్రెస్), 14వ వార్డు రాంశెట్టి హర్షిత, (కాంగ్రెస్), 15వ వార్డు సూరోజు వనిత(కాంగ్రెస్), 16వ వార్డు యాడారం ప్రియాంక, (బీజేపీ), 17వ వార్డు లోలం శ్రీనివాస్, (బీఆర్ఎస్), 18వ వార్డు మీర్జా హఫీజ్ భేగ్(బీఆర్ఎస్), 19వ వార్డు భాను ప్రకాష్, (బీజేపీ), 20వ వార్డు కళ్లెం సావిత్రి, (కాంగ్రెస్), 21వ వార్డు తాటి లావణ్య(కాంగ్రెస్), 22వ వార్డు హఫీజ్ సుల్తానా, (కాంగ్రెస్), 23వ వార్డు సుల్తానా బేగం, (కాంగ్రెస్), 24వ వార్డు మహమ్మద్ అబ్దుల్(కాంగ్రెస్), 25వ వార్డు దాకి అరవింద్, (బీజేపీ), 26వ వార్డు మోచి మధు, (బీజేపీ), 27వ వార్డు గోపు బాలమణి(బీఆర్ఎస్), 28వ వార్డు మామిండ్ల లక్ష్మణ్, (బీఆర్ఎస్), 29వ వార్డు మహ్మద్ అంజాద్, (కాంగ్రెస్), 30వ వార్డు సలీం ఫాతిమా(కాంగ్రెస్), 31వ వార్డు సయ్యద్ ఎజాజ్ హుసేన్, (బీఆర్ఎస్), 32వ వార్డు గ్యార అఖిల, (కాంగ్రెస్), 33 వ వార్డు కుంట లక్ష్మారెడ్డి(బీజేపీ), 34వ వార్డు ఆకుల సుజిత, (బీజేపీ), 35వ వార్డు భోజన్నగారి వినోద, (బీజేపీ), 36వ వార్డు కైరా రాహుల్ గౌడ్(బీజేపీ), 37వ వార్డు అర్కల ప్రభాకర్, (బీఆర్ఎస్), 38వ వార్డు ఇప్ప ఉమారాణి, (ఇండిపెండెంట్), 39వవార్డు మోటూరి శ్రీకాంత్(బీజేపీ), 40వ వార్డు సాహెబ్ నాగమణి, (ఇండిపెండెంట్), 41వ వార్డు కాళ్ల రాజమణి, (కాంగ్రెస్), 42వ వార్డు పెద్దబోయిన శ్వేత(బీజేపీ), 43వ వార్డు తోట వంశీకృష్ణ, (బీజేపీ), 44వ వార్డు ప్రీతి జైన్, (బీజేపీ), 45వ వార్డు పిట్ల వేణుగోపాల్ (బీఆర్ఎస్), 46వ వార్డు గెరిగంటి లక్ష్మీనారాయణ, (బీఆర్ఎస్), 47వ వార్డు గెరిగంటి స్వప్న(బీఆర్ఎస్), 48వ వార్డు ఫెరోజ్ సుల్తానా, (కాంగ్రెస్), 49వ వార్డు ఎండి ఇసాక్ షేరు(కాంగ్రెస్).