అక్షరటుడే, కామారెడ్డి : Kamareddy Municipal Elections Results | కామారెడ్డి మన్సిపల్ ఎన్నికల్లో ఉత్కంఠ నెలకొంది. ప్రధాన పార్టీలు విజయం కోసం పోరాడుతున్నాయి. కౌంటింగ్ సెకండ్ రౌండ్లోనూ ఏ పార్టీకి స్పష్టమైన ఆధిక్యం రాలేదు. బీజేపీ (BJP) నాలుగు స్థానాల్లో విజయం సాధించగా.. కాంగ్రెస్ (Congress) మూడు స్థానాల్లో గెలిచింది. బీఆర్ఎస్ (BRS) మూడు స్థానాల్లో విజయం సాధించాయి. రెండో రౌండ్ ఫలితాలు పూర్తిగా రావాల్సి ఉంది.
Kamareddy Municipal Elections Results | గెలిచిన అభ్యర్థులు వీరే..
12వ వార్డు కాసర్ల గోదావరి (బీఆర్ఎస్), 15వ వార్డు సూరోజు వనిత (కాంగ్రెస్), 18వ వార్డు మీర్జా హఫీజ్ భేగ్ (బీఆర్ఎస్) గెలుపొందారు 21వార్డు తాటి లావణ్య (కాంగ్రెస్), 27వ వార్డు గోపు బాలమణి (బీఆర్ఎస్), 33వ వార్డు కుంట లక్ష్మారెడ్డి (బీజేపీ), 36వ వార్డు కైరా రాహుల్ గౌడ్ (బీజేపీ), 39వ వార్డు మోటూరి శ్రీకంత (బీజేపీ), 42వ వార్డు పెద్దబోయిన శ్వేత (బీజేపీ), 3వ వార్డు షేక్ బబ్లు( ఇండిపెండెంట్), 24వ మహ్మద్ అబ్దుల్ (కాంగ్రెస్) విజయం సాధించారు.