అక్షరటుడే, కామారెడ్డి: kamareddy municipal elections | కామారెడ్డి Kamareddy జిల్లాలోని నాలుగు మున్సిపాలిటీలలో పోటీ చేసే అభ్యర్థుల జాబితా ఖరారైంది. ఈ మేరకు అధికారులు వివరాలు వెల్లడించారు. మంగళవారం మధ్యాహ్నం 3 గంటల వరకు ప్రధాన పార్టీల నుంచి పలువురు అభ్యర్థులను ఉపసంహరించేలా చేశారు.
రాజకీయ పార్టీల నాయకులు మాత్రమే కాకుండా స్వతంత్ర అభ్యర్ధులు సైతం తమ నామినేషన్లు ఉపసంహరించుకున్నారు. జిల్లాలోని నాలుగు మున్సిపాలిటీలలో మొత్తం 1005 నామినేషన్లు దాఖలు కాగా.. సగానికి పైగా నామినేషన్లు ఉపసంహరించుకున్నారు. ప్రస్తుతం కామారెడ్డి జిల్లాలోని 92 వార్డులలో 447 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు.
kamareddy municipal elections | ఎక్కడ ఎంత మంది అంటే..
కామారెడ్డి మున్సిపాలిటీలో మొత్తం 254 మంది ఎన్నికలా బరిలో ఉన్నారు. అందులో బీజేపీ నుంచి 48, బీఆర్ఎస్ నుంచి 48, కాంగ్రెస్ నుంచి 49 మంది, ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి ఒకరు, బీఎస్పీ నుంచి ఒకరు, సీపీఐఎం నుంచి ముగ్గురు, ఎంఐఎం నుంచి 8 మంది బరిలో ఉండగా ఇతర గుర్తింపు పొందిన పార్టీల నుంచి 14 మంది, స్వతంత్ర అభ్యర్ధులు 81 మంది బరిలో నిలిచారు.
ఎల్లారెడ్డి నియజకవర్గంలో మొత్తం 45 మంది పోటీలో నిలిచారు. ఇందులో బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్ నుంచి 12 మంది చొప్పున 36 మంది, బీఎస్పీ నుంచి ఇద్దరు, స్వతంత్ర అభ్యర్ధులు ఏడుగురు బరిలో ఉన్నారు.
బాన్సువాడ మున్సిపాలిటీలో మొత్తం 85 మంది పోటీకి ఉన్నారు. ఇందులో బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల నుంచి 19 మంది చొప్పున 38 మంది, బీజేపీ నుంచి 17 మంది, స్వతంత్ర అభ్యర్ధులు 29 మంది, ఎంఐఎం నుంచి ఒకరు పోటీలో ఉన్నారు.
బిచ్కుంద మున్సిపాలిటీలో మొత్తం 63 మంది పోటీ పడుతున్నారు. ఇందులో బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్ నుంచి 12 మంది చొప్పున 36 మంది, బీఎస్పీ నుంచి ఒకరు, ఎంఐఎం నుంచి ఒకరు, ఇతర పార్టీల నుంచి నలుగురు, స్వతంత్ర అభ్యర్ధులు 21 మంది బరిలో నిలిచారు.
మొత్తం జిల్లాలోని నాలుగు మున్సిపాలిటీలలో ఉన్న 92 వార్డులలో ఆమ్ ఆద్మీ పార్టీ Aam Aadmi Party,నుంచి ఒకరు, బీఎస్పీ నుంచి నలుగురు, బీజేపీ నుంచి 89, సీపీఐఎం నుంచి ముగ్గురు, కాంగ్రెస్ Congress నుంచి 92, ఎంఐఎం నుంచి 10, బీఆర్ఎస్ నుంచి 92, ఇతర పార్టీల నుంచి 18, స్వతంత్ర అభ్యర్ధులు 138 మంది ఎన్నికల బరిలో ఉన్నారు. బుధవారం నుంచి ఆయా వార్డులలో ప్రచారాన్ని హోరెత్తించనున్నారు.