33
అక్షరటుడే, కామారెడ్డి : Kamareddy Municipal Counting Results | కామారెడ్డి మున్సిపాలిటీలో కౌంటింగ్ ఉత్కంఠగా కొనసాగుతోంది. స్థానిక ఎస్పీ ఆఫీస్ సమీపంలోని ఏఎంసీ గోడౌన్లో (AMC Godown) మున్సిపల్ ఎన్నికలకు (Municipal Elections) సంబంధించి కౌంటింగ్ జరుగుతోంది.
Kamareddy Municipal Counting Results | పోటాపోటీగా ఫలితాలు..
కామారెడ్డి మున్సిపాలిటీ (Kamareddy Municipality)లో ఫలితాలు ఇలా ఉన్నాయి. మొదటి రౌండ్లో 32 వార్డులకు సంబంధించి కౌంటింగ్ జరగగా పార్టీల మధ్య ఉత్కంఠ కొనసాగింది. 32 వార్డులలో కాంగ్రెస్ 13, బీజేపీ 11, బీఆర్ఎస్ 6, స్వతంత్ర అభ్యర్ధులు 2 వార్డులలో గెలుపొందారు. మధ్యాహ్నం వరకు కాంగ్రెస్ బీజేపీల మధ్య హోరాహోరీగా సాగింది. ప్రస్తుతం రెండవ రౌండ్ లో 17 వార్డుల కౌంటింగ్ కొనసాగుతోంది.
వార్డుల వారీగా చూస్తే..
కామారెడ్డి మున్సిపాలిటీలో మొదటి రౌండ్ ఫలితాలు ఇవే.. 1 వ వార్డు గడ్డమీది మహేష్, కాంగ్రెస్, 2 వ వార్డు ధరావత్ మోతిలాల్ (కాంగ్రెస్), 4వ వార్డు షేక్ జావీద్(కాంగ్రెస్), 5వ వార్డు తహసీన్ మున్నిసా (కాంగ్రెస్), 7వ వార్డు ఫరీన్ కాతూన్, బీఆర్ఎస్, 8వ వార్డు శ్రీధర్ రెడ్డి (బీజేపీ), 10వ వార్డు కాసర్ల మాధవి, (బీజేపీ), 11 వ వార్డు కాసర్ల రాణి, బీజేపీ, 13 వ వార్డు కొత్తపల్లి లలిత, కాంగ్రెస్, 14 వ వార్డు రాంశెట్టి హర్షిత, కాంగ్రెస్, 16 వ వార్డు యాడారం ప్రియాంక, బీజేపీ, 17 వ వార్డు లోలం శ్రీనివాస్, బీఆర్ఎస్, 19 వ వార్డు భాను ప్రకాష్, బీజేపీ, 20 వ వార్డు కళ్లెం సావిత్రి, కాంగ్రెస్ 22 వ వార్డు హఫీజ్ సుల్తానా, కాంగ్రెస్, 23 వ వార్డు సుల్తానా బేగం, కాంగ్రెస్, 25 వ వార్డు దాకి అరవింద్, బీజేపీ, 26 వ వార్డు మోచి మధు, బీజేపీ, 28వ వార్డు మామిండ్ల లక్ష్మణ్, బీఆర్ఎస్, 29 వ వార్డు మహ్మద్ అంజాద్, కాంగ్రెస్, 31 వ వార్డు సయ్యద్ ఎజాజ్ హుసేన్, బీఆర్ఎస్, 32 వ వార్డు గ్యార అఖిల, కాంగ్రెస్, 34 వ వార్డు ఆకుల సుజిత, బీజేపీ, 35వ వార్డు భోజన్నగారి వినోద, బీజేపీ, 37 వ వార్డు అర్కల ప్రభాకర్, బీఆర్ఎస్, 38 వ వార్డు ఇప్ప ఉమారాణి, ఇండిపెండెంట్, 40 వ వార్డు గంగమణి , ఇండిపెండెంట్, 41వ వార్డు కాళ్ళ రాజమని, కాంగ్రెస్, 43వ వార్డు తోట వంశీకృష్ణ, బీజేపీ, 44 వ వార్డు ప్రీతి జైన్, బీజేపీ, 46వ వార్డు గెరిగంటి లక్ష్మీనారాయణ, బీఆర్ఎస్, 48 వ వార్డు ఫెరోజ్ సుల్తానా, కాంగ్రెస్ ఆధిక్యంలో ఉన్నారు.