అక్షరటుడే, కామారెడ్డి: కానిస్టేబుల్ శ్రీధర్ కుటుంబానికి అండగా ఉంటానని కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకట రమణారెడ్డి అన్నారు. మావోయిస్టులు మందుపాతర పేల్చిన ఘటనలో మృతి చెందిన పాల్వంచకు చెందిన వడ్ల శ్రీధర్ కుటుంబాన్ని ఆదివారం పరామర్శించారు. కుటుంబ సభ్యులను ఓదార్చి ధైర్యం చెప్పారు. బాధిత కుటుంబానికి అండగా నిలుస్తామని చెప్పారు.
