ePaper
More
    Homeజిల్లాలుకామారెడ్డిPranahitha Chevella | కామారెడ్డికి లైఫ్ లైన్ ప్రాజెక్టు ప్రాణహిత చేవెళ్ల: షబ్బీర్ అలీ

    Pranahitha Chevella | కామారెడ్డికి లైఫ్ లైన్ ప్రాజెక్టు ప్రాణహిత చేవెళ్ల: షబ్బీర్ అలీ

    Published on

    అక్షరటుడే, కామారెడ్డి: Pranahitha Chevella | ప్రాణహిత- చేవెళ్ల కామారెడ్డి లైఫ్ లైన్ ప్రాజెక్టు అని ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ(Shabbir Ali) అన్నారు. రూ.1,400 కోట్ల వ్యయంతో నాటి సీఎం వైఎస్సార్(YSR) కామారెడ్డిలో ప్రాణహిత -చేవెళ్ల పైలాన్​కు శంకుస్థాపన చేశారని తెలిపారు. కామారెడ్డిలోని ఆర్​అండ్​బీ గెస్ట్ హౌస్(R&B Guest House)లో శనివారం ఇరిగేషన్, ఆర్ డబ్ల్యూఎస్(RWS) అధికారులతో కాళేశ్వరం 22 ప్యాకేజీ పనులపై సమీక్ష నిర్వహించారు.

    అనంతరం షబ్బీర్ అలీ మీడియాతో మాట్లాడారు. కాళేశ్వరం ప్యాకేజి 20, 21, 22తో కామారెడ్డి, ఎల్లారెడ్డి నియోజకవర్గాలలో 2 లక్షల ఎకరాలకు సాగునీరు అందనుందన్నారు. ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి(Uttam Kumar Reddy)తో జరిగిన సమావేశంలో పనులపై చర్చించామని తెలిపారు. ఇటీవల భూసేకరణ, కాంట్రాక్టర్ల బిల్లుల చెల్లింపు కోసం రూ.23.15 కోట్లు విడుదలయ్యాయని వెల్లడించారు.

    ప్రాణహిత- చేవెళ్ల సమయంలో కొండం చెరువు వద్ద 0.80 టీఎంసీల డిజైన్ ఉండేదని, గత ప్రభుత్వంలో దీనిని 3.5 టీఎంసీలకు కేసీఆర్(KCR) పెంచారన్నారు. టీఎంసీల పెంపుతో 9 గ్రామాలు, తండాలు ముంపునకు గురవుతున్నాయని, బాధిత గ్రామస్థులు అభ్యంతరం వ్యక్తం చేశారన్నారు. నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి(MLA Bhupathi Reddy) సైతం అభ్యంతరం తెలిపారన్నారు. త్వరలో పాత డిజైన్​తోనే పనులను చేపడతారని పేర్కొన్నారు. వారం రోజుల్లో తిమ్మక్ పల్లి 1.4 టీఎంసీ పనులు మొదలుపెట్టి 2వ విడత భూసేకరణ మొదలు పెట్టనున్నారన్నారు. ప్రభుత్వం(Government) విడుదల చేసిన రూ. 23.15 కోట్లతో 316 ఎకరాల భూసేకరణ చేపట్టనున్నారని, 619 మందికి విచారణ జరిపి ప్రభుత్వ పరిహారం అందించనున్నారని, కాంట్రాక్టర్లకు బిల్లులు కూడా చెల్లిస్తామని చెప్పారు. 2025-26 సంవత్సరానికి మరొక రూ. 200 కోట్లు విడుదల చేయడానికి ప్రభిత్వానికి ప్రతిపాదనలు పంపామని, త్వరలో నిధులు మంజూరవుతాయని చెప్పారు. కామారెడ్డి నియోజకవర్గంలో 80 వేల ఎకరాలకు సాగు నీరందించే లక్ష్యమని తెలిపారు. కామారెడ్డి ప్రజలకు శాశ్వత ప్రాతిపదికన సాగునీరు, తాగునీరు అందించిన తర్వాతే తుది శ్వాస విడుస్తానని, ఇది తన కలల ప్రాజెక్టు అని పేర్కొన్నారు.

    Pranahitha Chevella | ఇందిరమ్మ ఇళ్లకు ప్రారంభోత్సవం

    నియోజకవర్గంలో 3,500 ఇందిరమ్మ ఇళ్ల(Indiramma Houses) నిర్మాణాలు చేపట్టనున్నామని షబ్బీర్ అలీ పేర్కొన్నారు. ఎన్నికల సమయంలో సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) పాదయాత్రలో భాగంగా చిన్నమల్లారెడ్డి(Chinna Mallareddy)లో ముగ్గురు దళితుల ఇళ్లను పరిశీలించి.. అధికారంలోకి వచ్చాక ఇందిరమ్మ ఇళ్లను ఇస్తామని బాధితులకు హామీ ఇచ్చారన్నారు. ఈ ముగ్గురు బాధితులకు ఇందిరమ్మ ఇళ్లు మంజూరయ్యాయని, ఆదివారం రోజు వారితోనే ప్రారంభోత్సవం చేస్తామన్నారు.

    Pranahitha Chevella | ఉత్తమ విద్యార్థులకు ఆర్థిక సహాయం

    ప్రభుత్వ పాఠశాల(Government School)లో చదువుతూ పదోతరగతిలో ఉత్తమ మార్కులు పొందిన విద్యార్థులకు ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ(Shabbir Ali) సన్మానించి ఆర్థిక సహాయాన్ని అందజేశారు. ఎర్రపహాడ్ గురుకుల పాఠశాలలో చదువుతూ 587 మార్కులు పొందిన రమేశ్​, మాచారెడ్డి జడ్పీ పాఠశాలలో 581 మార్కులు పొందిన సభా తబస్సుమ్, లింగంపేట మైనారిటీ పాఠశాల విద్యార్థి దీక్షిత్​(581), కల్వరాల పాఠశాల విద్యార్థి భావిక(581), ఎర్రపహాడ్ గురుకుల పాఠశాల విద్యార్థి మౌర్య ఆనంద్ రెడ్డి(581)లను షబ్బీర్ అలీ సన్మానించారు. మాచారెడ్డికి చెందిన తబస్సుమ్ పేదరికంలో ఉండడంతో తన చదువుకు బాధ్యత తీసుకుంటానని తెలిపారు. అలాగే రాష్ట్ర స్థాయిలో 596 మార్కులతో ప్రథమ ర్యాంక్ సాధించిన ఎస్పీఆర్ పాఠశాల విద్యార్థి నిమ్మ అంచిత, 590 మార్కులు సాధించిన శ్రీనిత, గాయత్రీలను సన్మానించి ఆర్థిక సహాయం అందజేశారు.

    Latest articles

    Prajwal Revanna | ప్రజ్వల్ రేవణ్ణకు జీవిత ఖైదు.. అత్యాచారం కేసులో న్యాయస్థానం సంచలన తీర్పు

    అక్షరటుడే, వెబ్​డెస్క్:​ Prajwal Revanna | కర్ణాటక రాజకీయాల్లో సంచలనం సృష్టించిన అత్యాచారం కేసులో కోర్టు సంచలన తీర్పు...

    BRS Nizamabad | బీఆర్ఎస్​ నాయకుల ముందస్తు అరెస్ట్​లు

    అక్షరటుడే నిజామాబాద్ సిటీ: BRS Nizamabad | జిల్లాలో పలువురు బీఆర్​ఎస్​ నాయకులను ముందస్తుగా అరెస్ట్​ చేశారు. తెలంగాణ...

    Giriraj College | అధ్యాపకుల సమస్యల పరిష్కారానికి కృషి

    అక్షరటుడే, ఇందూరు: Giriraj College | అధ్యాపకుల సమస్యల పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానని తెలంగాణ కాలేజ్...

    OG Firestorm Song | ఓజీ ఫ‌స్ట్ సాంగ్‌.. రిలీజ్ అయిన గంట‌లోనే ఎన్ని వ్యూస్ రాబ‌ట్టిందంటే…!

    అక్షరటుడే, వెబ్​డెస్క్: OG Firestorm Song | ప‌వ‌న్ క‌ళ్యాణ్ రాజ‌కీయాల‌లోకి వచ్చిన త‌ర్వాత ఆయ‌న సినిమాల కోసం...

    More like this

    Prajwal Revanna | ప్రజ్వల్ రేవణ్ణకు జీవిత ఖైదు.. అత్యాచారం కేసులో న్యాయస్థానం సంచలన తీర్పు

    అక్షరటుడే, వెబ్​డెస్క్:​ Prajwal Revanna | కర్ణాటక రాజకీయాల్లో సంచలనం సృష్టించిన అత్యాచారం కేసులో కోర్టు సంచలన తీర్పు...

    BRS Nizamabad | బీఆర్ఎస్​ నాయకుల ముందస్తు అరెస్ట్​లు

    అక్షరటుడే నిజామాబాద్ సిటీ: BRS Nizamabad | జిల్లాలో పలువురు బీఆర్​ఎస్​ నాయకులను ముందస్తుగా అరెస్ట్​ చేశారు. తెలంగాణ...

    Giriraj College | అధ్యాపకుల సమస్యల పరిష్కారానికి కృషి

    అక్షరటుడే, ఇందూరు: Giriraj College | అధ్యాపకుల సమస్యల పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానని తెలంగాణ కాలేజ్...