అక్షరటుడే, ఎల్లారెడ్డి: Guinness Book of world record | హైదరాబాద్ గచ్చిబౌలి స్టేడియంలో (Gachibowli Stadium) 4,608 మంది కళాకారులు 40 నిమిషాల పాటు కూచిపూడి నృత్యం చేసి గిన్నిస్ రికార్డు నెలకొల్పారు. భారత్ ఆర్ట్స్ అకాడమీ (Bharat Arts Academy) ఆధ్వర్యంలో కూచిపూడి కళావైభవం 2 పేరిట ఈ ప్రదర్శనలు చేపట్టారు.
Guinness Book of world record | కామారెడ్డి కూచిపూడి కళాక్షేత్రం విద్యార్థులు
తెలుగు రాష్ట్రాలతో పాటు విదేశాల నుంచి వచ్చిన కళాకారులు ఉత్సాహంగా నాట్యం చేశారు. ఈ అకాడమీ ఆధ్వర్యంలో 2023లో 4,218 మంది విద్యార్థులతో ఈ ప్రదర్శనలను గిన్నిస్ రికార్డులోకి ఎక్కగా.. తాజాగా ఆ రికార్డును ఈ ఏడాది వారే అధిగమించారు. కామారెడ్డి పట్టణానికి చెందిన కూచిపూడి కళాక్షేత్రం నుంచి 30 మంది కళాకారులు ఈ నాట్య ప్రదర్శనలో పాల్గొన్నారు. ప్రముఖ నాట్య కళాకారిణి తార ఆధ్వర్యంలో విద్యార్థులు ఈ పోటీల్లో పాల్గొని కామారెడ్డికి గిన్నిస్ బుక్ రికార్డును తీసుకువచ్చారు. ఈ మేరకు గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్ ప్రతినిధి స్వప్నిల్ ధ్రువీకరణ పత్రాలను అందజేశారు.