Kamareddy DMHO Appointment | కామారెడ్డి డీఎంహెచ్​వోగా రవీందర్ గౌడ్

కామారెడ్డి డీఎంహెచ్​వోగా డాక్టర్ రవీందర్ గౌడ్​ నియమితులయ్యారు. ఈ మేరకు డైరెక్టర్ ఆఫ్ హెల్త్ డిపార్ట్​మెంట్​ నుంచి ఉత్తర్వులు జారీ అయ్యాయి.

అక్షరటుడే, ఎల్లారెడ్డి : Kamareddy DMHO Appointment | కామారెడ్డి డీఎంహెచ్​వోగా డాక్టర్ రవీందర్ గౌడ్​ నియమితులయ్యారు. ఈ మేరకు డైరెక్టర్ ఆఫ్ హెల్త్ డిపార్ట్​మెంట్​ నుంచి ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఈ సందర్భంగా సోమవారం ఆయన డీఎంహెచ్​వోగా ఛార్జ్​ తీసుకున్నారు. అనంతరం కార్యాలయం సిబ్బందితో సమావేశం అయ్యారు.

Kamareddy DMHO Appointment | రవీందర్ గౌడ్ నేపథ్యమిది..

ఎల్లారెడ్డి మున్సిపల్ (Yellareddy Municipal​) 5వ వార్డు గండి మాసానిపేట్ గ్రామానికి చెందిన మాజీ సింగిల్ విండో అధ్యక్షుడు సాయాగౌడ్, చంద్రకళ దంపతుల కుమారుడు రవీందర్ గౌడ్ ఎంబీబీఎస్ పూర్తి చేశారు. 1998లో మెదక్ జిల్లాలోని గడి పెద్దాపూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ప్రభుత్వ వైద్యుడిగా ప్రస్థానాన్ని ప్రారంభించారు. అక్కడి నుంచి సంగారెడ్డి జిల్లా టీబీ, లెప్రసీ, ఎయిడ్స్ కంట్రోల్ నోడల్ అధికారిగా ఆరేళ్లపాటు బాధ్యతలు చేపట్టారు. సర్వీస్​లోనే ఉంటూ 2006 నుంచి 2009 వరకు ఉస్మానియాలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. పీజీ పూర్తయిన తర్వాత గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఆరోగ్య అధికారిగా 2009 నుంచి 12 వరకు పనిచేశారు.

Kamareddy DMHO Appointment | టీబీ కంట్రోల్​ అధికారిగా..

2012 నుంచి 14 వరకు సంగారెడ్డి జిల్లా (Sangareddy District) టీబీ కంట్రోల్ అధికారిగా విధులు నిర్వహించారు. 2014 నుంచి 18 వరకు ఉమ్మడి నిజామాబాద్ జిల్లా డిప్యూటీ డీఎంహెచ్​వో, టీబీ కంట్రోల్ అధికారిగా విధులు చేపట్టారు. 2018 నుంచి 23 వరకు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఆరోగ్య అధికారిగా పనిచేశారు. 2023 నుంచి 2025 వరకు జనగామ జిల్లా (Jangaon District)ఇన్​ఛార్జి డీఎంహెచ్​వోగా బాధ్యతలు నిర్వహించారు. 2025లో కామారెడ్డి జిల్లా ఆర్ఎంవోగా నియమితులయ్యారు. ప్రస్తుతం కామారెడ్డి జిల్లా (Kamareddy District) డీఎంహెచ్​వోగా పదోన్నతి పొందారు. కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి పట్టణానికి చెందిన రవీందర్ గౌడ్ డీఎంహెచ్​వోగా నియమితులు కావడంపై జిల్లా, మండలాలకు చెందిన పలువురు హర్షం వ్యక్తం చేశారు.

Related articles

Nizamabad Police Prajavani | పోలీస్​ ప్రజావాణిలో వినతులు స్వీకరించిన సీపీ

పోలీస్​ ప్రజావాణిలో భాగంగా సోమవారం సీపీ కార్యాలయంలో సీపీ సాయిచైతన్య 30 ఫిర్యాదులను స్వీకరించారు. అనంతరం పోలీస్​డ్యూటీ మీట్​లో పతకాలు సాధించిన సిబ్బందిని అభినందించారు.

Harish Rao contractor payments | చిన్న కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించాలి : హరీశ్​రావు

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Harish Rao contractor payments | రాష్ట్ర ప్రభుత్వం చిన్న కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించడం లేదని మాజీ మంత్రి హరీశ్​రావు...

Advocate Attack Case | న్యాయవాదిపై దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం

రుద్రూర్​లో న్యాయవాది కళ్యాణిపై ముష్కరుల దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామని బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేష్ కులాచారి అన్నారు.

Peaceful Municipal Elections | అందరి సహకారంతో ప్రశాంతంగా ఎన్నికలు

అందరి సహకారంతో జిల్లాలో మున్సిపల్ ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించామని కలెక్టర్ ఇలా త్రిపాఠి తెలిపారు. ఈ మేరకు పలువురు అధికారులను సన్మానించారు.