అక్షరటుడే, కామారెడ్డి : Kamareddy Degree College Job Mela | కామారెడ్డి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఈనెల 17న ఉద్యోగ మేళా నిర్వహించనున్నారు. ఈ మేరకు టీఎస్కేసీ ఆధ్వర్యంలో మేళా జరుగనుందని కళాశాల ప్రిన్సిపాల్ విజయ్ కుమార్ (Principal Vijay Kumar) శనివారం ఒక ప్రకటనలో తెలిపారు.
Kamareddy Degree College Job Mela | మ్యాజిక్ బస్ ఇండియా ఫౌండేషన్..
మ్యాజిక్ బస్ ఇండియా ఫౌండేషన్ సౌజన్యంతో బహుళజాతి కంపెనీలైన క్యాలిబర్ (calibehr), జస్ట్ డయల్ (Justdial), డీబీఎస్ బ్యాంక్, 24/7 జాబ్స్, జియో, సాగిలిటీ (sagility), డిజిటైడ్ (digitide), ముత్తూట్ (muthoot finance), మెడ్‌ప్లస్ (mediplus)లో ఉద్యోగాల కోసం ఉద్యోగ మేళా నిర్వహిస్తున్నట్టు తెలిపారు.
ఏదైనా డిగ్రీలో 50శాతం మార్కులు..
ఈ ఉద్యోగ మేళాకు ఏదైనా ఇంటర్, డిగ్రీ, బీటెక్, బీఫార్మసీ, పీజీలో 50శాతం మార్కులు కలిగి ఉండి 30ఏళ్లలోపు వయసు ఉన్నవారు అర్హులని ప్రిన్సిపాల్ పేర్కొన్నారు. ఆసక్తి గల అభ్యర్థులు 17న ఉదయం 10 :30 లోపు రెజ్యుమ్, అకడమిక్ సర్టిఫికెట్స్‌తో కళాశాలలో హాజరు కావాలని, ఈ సదవకాశాన్ని వినియోగించుకోవాలని తెలిపారు. మరిన్ని వివరాలకు కళాశాల టీఎస్కేసీ విభాగంలో లేదా కంపెనీ సంబంధీకులను 9553141962, 8184827291లలో సంప్రదించాలని సూచించారు.