Homeజిల్లాలుకామారెడ్డిKamareddy Congress | ఎల్లారెడ్డి ఎమ్మెల్యేను సన్మానించిన కామారెడ్డి డీసీసీ అధ్యక్షుడు

Kamareddy Congress | ఎల్లారెడ్డి ఎమ్మెల్యేను సన్మానించిన కామారెడ్డి డీసీసీ అధ్యక్షుడు

కామారెడ్డి డీసీసీ అధ్యక్షుడిగా మల్లికార్జున్ పటేల్ ఎన్నికైన విషయం తెలిసిందే. ఈ మేరకు ఆయన ఆదివారం ఎమ్మెల్యే మదన్​మోహన్​ను మర్యాదపూర్వకంగా కలిశారు.

- Advertisement -

అక్షరటుడే, ఎల్లారెడ్డి: Kamareddy Congress | కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి జిల్లా అధ్యక్షుడిగా మల్లికార్జున్ పటేల్ ఎన్నికైన విషయం తెలిసిందే. ఈ మేరకు ఆయన ఆదివారం ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్​మోహన్​(Mla Madan Mohan Rao) ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఎమ్మెల్యేకు ధన్యవాదాలు తెలిపారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీని బూత్​స్థాయి నుంచి బలోపేతం చేసేందుకు కృషి చేయాలని ఆయన పేర్కొన్నారు. ప్రజలతో మమేకం కావాలన్నారు. అందు కోసం శ్రమించాలని సూచించారు.

2029లో రాహుల్ గాంధీని(Rahul Gandhi) ప్రధానమంత్రిగా చూడాలంటే సంకల్పంతో ప్రతి కార్యకర్త క్షేత్రస్థాయిలో పార్టీ కోసం నిస్వార్థంగా పనిచేయాలని సూచించారు. అలాగే ప్రజలను చైతన్యవంతం చేస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను ఎప్పటికప్పుడు వారికి అర్థమయ్యేలా వివరించాలని సూచించారు. నూతనంగా ఎన్నికైన డీసీసీ అధ్యక్షుడికి ఎల్లవేళలా సహాయ సహకారాలు అందిస్తామని ఆయన స్పష్టం చేశారు.