అక్షరటుడే, కామారెడ్డి : Kamareddy Journalists Protest | కౌంటింగ్ కేంద్రం (Counting Center)లో జర్నలిస్టులకు కనీస వసతులు కల్పించడంలో అధికారులు విఫలమయ్యారని జర్నలిస్టులు ఆరోపించారు. ఈ మేరకు కలెక్టరేట్ (Collectorate) రహదారిపై డీపీఆర్వో అధికారి (DPRO officer) నిర్లక్ష్య వైఖరిపై నిరసన వ్యక్తం చేస్తూ జర్నలిస్టులు ధర్నా చేపట్టారు.
ఈ సందర్భంగా జర్నలిస్టులు మాట్లాడుతూ.. కౌంటింగ్ ప్రారంభమై గంటన్నర గడుస్తున్నా ఓట్లు లెక్కింపు ప్రక్రియపై ఎలాంటి సమాచారం ఇవ్వకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. మీడియాకు ప్రత్యేక విభాగం ఏర్పాటు చేయలేదని, కౌంటింగ్ ఏజంట్లతో పాటు జర్నలిస్టులను కూర్చోబెట్టారని మండిపడ్డారు. పిలిచి పాసులిచ్చి అవమానించారని ఆరోపించారు. పాసులు ఉన్న జర్నలిస్టుల (Journalists)పై ఆంక్షలు విధిస్తూ పోలీసులు అడ్డుకోవడాన్ని తప్పుపట్టారు. ఫలితాలకు సంబంధించిన డిస్ప్లే ఏర్పాటు చేయలేదని, ఇతరులు చెప్తే ఫలితాలు తెలుసుకునే పరిస్థితి లేదన్నారు. వెంటనే డీపీఆర్వోను సస్పెండ్ చేసి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అప్పటివరకు ఎన్ని గంటలైనా రోడ్డుపై నుంచి కదిలే ప్రసక్తి లేదని భీష్మించారు. దాంతో పోలీసులు జర్నలిస్టులకు నచ్చజెప్పే ప్రయత్నం చేసినా వినిపించుకోవడం లేదు.