Kamareddy corruption free governance | కామారెడ్డిలో అవినీతి రహిత పాలన అందించాలి: ప్రభుత్వ సలహాదారు షబ్బీర్​ అలీ

కామారెడ్డి పట్టణ ప్రజలకు అవినీతి రహిత పాలన అందించాలని కొత్తగా బాధ్యతలు చేపట్టిన మున్సిపల్ ఛైర్​పర్సన్ ఇప్ప ఉమారాణికి ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ సూచించారు.

అక్షరటుడే, కామారెడ్డి: Kamareddy corruption free governance | కామారెడ్డి పట్టణ ప్రజలకు (Kamareddy Municipality) అవినీతి రహిత పాలన అందించాలని కొత్తగా బాధ్యతలు చేపట్టిన మున్సిపల్ ఛైర్​పర్సన్ ఇప్ప ఉమారాణికి (Ippa Uma Rani) ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ(Mohammed Ali Shabbir) సూచించారు. మున్సిపల్ కార్యాలయంలో సోమవారం నూతన ఛైర్​పర్సన్​గా ఎన్నికైన ఇప్ప ఉమారాణి బాధ్యతలు స్వీకరించారు. ఎంపీ సురేష్ షెట్కార్, ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఛైర్ పర్సన్​కు శుభాకాంక్షలు తెలిపారు.

Kamareddy corruption free governance | కామారెడ్డి మున్సిపల్​ కార్పొరేషన్​ కాబోతోంది..

ఈ సందర్భంగా షబ్బీర్ అలీ మాట్లాడుతూ.. కామారెడ్డి మున్సిపాలిటీలో(Municipal Development) లక్షకు పైగా ఓటర్లు పెరిగారని, రాబోయే ఐదేళ్లలో కామారెడ్డి మున్సిపల్ కార్పొరేషన్ కాబోతుందన్నారు. కామారెడ్డి (Kamareddy News) ప్రజలు తమపై నమ్మకంతో గెలిపించారని తెలిపారు. అన్ని రాజకీయ పార్టీలతో కలిసి ముందుకువెళ్తూ కామారెడ్డి పట్టణాన్ని అభివృద్ధి చేయాలని ఛైర్ పర్సన్​కు సూచించారు. వచ్చే వేసవి కాలంలో పట్టణ ప్రజలకు తాగునీటి సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలన్నారు.

నిధుల కొరత లేకుండా చూస్తాం..

కామారెడ్డికి ఎలాంటి నిధులు కొరత లేకుండా సీఎంతో మాట్లాడి అన్ని సమస్యలు పరిష్కారం చేయడానికి తన వంతు సహాయ సహకారాలు అందజేస్తానని షబ్బీర్​ అలీ హామీ ఇచ్చారు. ఎంపీ మాట్లాడుతూ.. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నందున నిధులకు కొరత లేదన్నారు. కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ మధు మోహన్, జిల్లా గ్రంథాలయ ఛైర్మన్ మద్ది చంద్రకాంత్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్ రాజేందర్ రెడ్డి, కౌన్సిలర్లు, తదితరులు పాల్గొన్నారు.

shashi kiran Mottala
shashi kiran Mottala
Author Bio : తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.

Related articles

Advocate Attack Case | న్యాయవాదిపై దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం

రుద్రూర్​లో న్యాయవాది కళ్యాణిపై ముష్కరుల దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామని బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేష్ కులాచారి అన్నారు.

Peaceful Municipal Elections | అందరి సహకారంతో ప్రశాంతంగా ఎన్నికలు

అందరి సహకారంతో జిల్లాలో మున్సిపల్ ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించామని కలెక్టర్ ఇలా త్రిపాఠి తెలిపారు. ఈ మేరకు పలువురు అధికారులను సన్మానించారు.

Nizamabad Deputy Mayor | డిప్యూటీ మేయర్ బాధ్యతల స్వీకరణ

నిజామాబాద్ కార్పొరేషన్ డిప్యూటీ మేయర్​గా సల్మా తహసిన్ సోమవారం బాధ్యతలను స్వీకరించారు. ఈ మేరకు సందర్భంగా ఆమెకు మేయర్​ దంపతులు శుభాకాంక్షలు తెలిపారు.

Kamareddy DMHO Appointment | కామారెడ్డి డీఎంహెచ్​వోగా రవీందర్ గౌడ్

కామారెడ్డి డీఎంహెచ్​వోగా డాక్టర్ రవీందర్ గౌడ్​ నియమితులయ్యారు. ఈ మేరకు డైరెక్టర్ ఆఫ్ హెల్త్ డిపార్ట్​మెంట్​ నుంచి ఉత్తర్వులు జారీ అయ్యాయి.