అక్షరటుడే, కామారెడ్డి: Kamareddy constituency | కామారెడ్డి నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో ఆదివారం సాయంత్రం ఈదురు గాలులు వీచాయి. దీంతో రామారెడ్డి నుంచి రెడ్డిపేట (ramareddy to reddypet) వెళ్లే దారిలో మద్దికుంట శివారులో రోడ్డుపై మర్రి చెట్టు విరిగిపడింది. రోడ్డుపై అడ్డంగా పడడంతో ఆ దారిలో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.