Kamareddy Chairperson | కామారెడ్డి ఛైర్​పర్సన్​గా ఉమారాణి బాధ్యతల స్వీకరణ.. భారీ బందోబస్తు

కామారెడ్డి మున్సిపల్​ ఛైర్​పర్సన్​గా ఉమారాణి సోమవారం బాధ్యతలు తీసుకోనున్నారు. దీంతో పోలీసులు పట్టణంలో బందోబస్తు ఏర్పాటు చేశారు.

అక్షరటుడే, కామారెడ్డి : Kamareddy Chairperson | కామారెడ్డి మున్సిపల్​ ఛైర్​పర్సన్​గా ఉమారాణి సోమవారం బాధ్యతలు తీసుకోనున్నారు. అయితే బీజేపీ, కాంగ్రెస్ మధ్య ప్రభుత్వ డిగ్రీ కళాశాల (Government Degree College) ఆస్తుల వివాదం సాగుతుండగా ఉద్రిక్త పరిస్థితుల మధ్య ఈ కార్యక్రమ నిర్వహణపై ఉత్కంఠ నెలకొంది.

Kamareddy Chairperson | 16న ప్రమాణస్వీకారం..

ఈనెల16న మున్సిపల్ పాలకవర్గ సభ్యులు ప్రమాణస్వీకారం, ఛైర్​పర్సన్, వైస్​ చైర్​పర్సన్​ ఎన్నిక, వారి ప్రమాణస్వీకారం ప్రశాంత వాతావరణంలో కొనసాగింది. అయితే సోమవారం మున్సిపల్ కార్యాలయం (Municipal Office)లో ఛైర్ పర్సన్ ఇప్ప ఉమారాణి బాధ్యతల స్వీకరణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ (Shabbir Ali), జహీరాబాద్ ఎంపీ సురేష్ షెట్కార్ హాజరు కానున్నారు. అయితే కామారెడ్డి మున్సిపల్ (Kamareddy Municipal) చరిత్రలో ఛైర్మన్ బాధ్యతల స్వీకరణ కార్యక్రమానికి మొట్టమొదటి సారిగా భారీ బందోబస్తు ఏర్పాటు చేయడం చర్చనీయాంశంగా మారింది.

Kamareddy Chairperson | మూడురోజులుగా ఉద్రిక్త పరిస్థితులు

మూడు రోజులుగా పట్టణంలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో పోలీసులు భారీబందోబస్తు ఏర్పాటు చేసినట్లుగా తెలుస్తోంది. మున్సిపల్ ఛైర్​పర్సన్​ బాధ్యతల స్వీకరణ అనంతరం కార్యాలయ ఆవరణలో సభ నిర్వహణకు ఏర్పాటు చేశారు. దీంతో పోలీసులు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఎస్పీ రాజేష్ చంద్ర (SP Rajesh Chandra) మున్సిపల్ కార్యాలయానికి చేరుకుని పదవి బాధ్యతల స్వీకరణ అనంతరం సభను ఇతర చోట ఏర్పాటు చేసుకోవాలని కాంగ్రెస్ నాయకులకు సూచించారు. దాంతో సభను సత్య కన్వెన్షన్ హాలుకు మార్చారు.

Related articles

Soumya Government Job | ఎక్సైజ్ కానిస్టేబుల్​ గాజుల సౌమ్య సోదరుడికి ప్రభుత్వ ఉద్యోగం

విధినిర్వహణలో గంజాయి ముఠాను పట్టుకునే క్రమంలో ఎక్సైజ్​ కానిస్టేబుల్​ గాజుల సౌమ్య మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ప్రభుత్వం ఆమె​ సోదరుడికి ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చింది.

Hyderabad CP Marriage Warning | పెళ్లికి ముందు దగ్గరవ్వొద్దు.. అమ్మాయిలకు సీపీ హెచ్చరిక

పెళ్లి పేరుతో జరిగే మోసాలపై యువతులు అప్రమత్తంగా ఉండాలని సీపీ సజ్జనార్​ సూచించారు. డబ్బులు డిమాండ్​ చేస్తే ఫిర్యాదు చేయాలన్నారు.

TTD Laddu Case Verdict | టీటీడీ లడ్డూ కేసులో ప్రభుత్వానికి ఊరట..

టీటీడీ లడ్డూ కేసులో ఏపీ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో ఊరట లభించింది. ఏకసభ్య కమిటీ విచారణ కొనసాగించవచ్చని ధర్మాసనం పేర్కొంది.

Adulterated Milk Deaths Rajahmundry | కల్తీపాల ఘటన.. ఐదుకు చేరిన మృతుల సంఖ్య

కల్తీ పాలతో ఐదుగురు మృతి చెందారు. ఈ ఘటన ఏపీలోని రాజమహేంద్రవరంలో చోటు చేసుకుంది.