అక్షరటుడే, కామారెడ్డి : Kamareddy Chairperson Election | కామారెడ్డి మున్సిపల్ ఛైర్పర్సన్ ఎన్నిక ప్రక్రియ పూర్తయింది. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీ (BRS Party)లు ఒక్కటై స్వతంత్ర అభ్యర్థి ఇప్ప ఉమారాణిని ఎన్నుకున్నాయి.
కామారెడ్డి మున్సిపల్ కార్యాలయానికి (Kamareddy Municipal Office) ఉదయం 10:30 గంటలకు కాంగ్రెస్ కౌన్సిలర్లు ప్రత్యేక బస్సులో చేరుకున్నారు. 11:20 గంటలకు బీఆర్ఎస్ కౌన్సిలర్లు, 12:00 గంటలకు ఎమ్మెల్యే వెంకట రమణారెడ్డితో పాటు బీజేపీ కౌన్సిలర్లు కార్లలో వచ్చారు. జిల్లా ఎన్నికల పరిశీలకుడు ప్రశాంత్ కుమార్ ఆధ్వర్యంలో అదనపు కలెక్టర్ మధు మోహన్ (Additional Collector Madhu Mohan) ఎన్నికైన కౌన్సిలర్లతో ప్రమాణస్వీకారం చేయించారు. అనంతరం ఛైర్ పర్సన్, వైస్ ఛైర్పర్సన్ ఎన్నిక నిర్వహించారు.
Kamareddy Chairperson Election | స్వతంత్ర అభ్యర్థికి పట్టం
కాంగ్రెస్ పార్టీ (Congress Party) నుంచి 49వ వార్డు కౌన్సిలర్‌గా గెలుపొందిన మహమ్మద్ ఇసాక్ షేరు మున్సిపల్ ఛైర్‌పర్సన్‌గా స్వతంత్ర అభ్యర్థి ఇప్ప ఉమారాణి పేరును ప్రతిపాదించారు. 29వ వార్డు కౌన్సిలర్ మహమ్మద్ అంజాద్ బలపరిచారు. బీజేపీ నుంచి 44వ వార్డు కౌన్సిలర్ ప్రీతి జైన్ ఛైర్పర్సన్ అభ్యర్థిగా గాండ్ల సుజిత పేరును ప్రతిపాదించగా 11వ వార్డు కౌన్సిలర్ కాసర్ల రాణి బలపరిచారు. స్వతంత్ర అభ్యర్థికి కాంగ్రెస్ నుంచి 19 మంది కౌన్సిలర్లు, బీఆర్ఎస్ నుంచి 11 మంది, స్వతంత్ర అభ్యర్థులు ముగ్గురు చేయి లేపి ఓటు వేశారు. బీజేపీ అభ్యర్థికి ఎమ్మెల్యే సహా బీజేపీకి చెందిన 17 మంది కౌన్సిలర్లు మద్దతు ప్రకటించారు. దాంతో కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు, స్వతంత్ర అభ్యర్థుల మద్దతుతో ఇప్ప ఉమారాణి ఛైర్‌పర్సన్‌గా ఎన్నికైనట్లు ఎన్నికల అధికారి ప్రకటించారు.
Kamareddy Chairperson Election | బీఆర్ఎస్కు వైస్ ఛైర్పర్సన్…
మున్సిపల్ వైస్ ఛైర్‌పర్సన్‌గా బీఆర్ఎస్ పార్టీకి చెందిన 12 వ వార్డు కౌన్సిలర్ కాసర్ల గోదావరిని 45వ వార్డు కౌన్సిలర్ పిట్ల వేణుగోపాల్ ప్రతిపాదించగా 18 వ వార్డు కౌన్సిలర్ బలపరిచారు. బీజేపీ నుంచి 39వ వార్డు కౌన్సిలర్ మోటూరి శ్రీకాంత్‌ను ఆ పార్టీ అభ్యర్థులు ప్రతిపాదించారు. కాంగ్రెస్, బీఆర్ఎస్, స్వతంత్ర కౌన్సిలర్ల మద్దతుతో కాసర్ల గోదావరి ఛైర్‌పర్సన్‌గా ఎన్నికయ్యారు. అనంతరం ఛైర్ పర్సన్, వైస్ ఛైర్ పర్సన్లతో ప్రమాణస్వీకారం చేయించారు.
వైస్ ఛైర్మన్‌గా ఎన్నికైన గోదావరి
