అక్షరటుడే, కామారెడ్డి: Kamareddy | పట్టణంలోని గంజ్ రెండో గేటు వద్ద ఏర్పడిన గుంత ప్రమాదకరంగా మారింది. వాహనాలు లోనికి వెళ్లే మార్గం కావడంతో రైతులు విత్తనాలు, ఎరువులను వాహనాల్లో తీసుకెళ్లే క్రమంలో గుంతలో దిగబడుతున్నాయి. దీంతో రైతులు(farmers), వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. సంబంధిత అధికారులు స్పందించి గుంత పూడ్చివేయించాలని రైతులు కోరుతున్నారు.
