ePaper
More
    Homeజిల్లాలుకామారెడ్డిCM Revanth Reddy | కామారెడ్డి, మెదక్​ క​లెక్టర్లు అలర్ట్​గా ఉండండి.. సీఎం రేవంత్​రెడ్డి ఆదేశం

    CM Revanth Reddy | కామారెడ్డి, మెదక్​ క​లెక్టర్లు అలర్ట్​గా ఉండండి.. సీఎం రేవంత్​రెడ్డి ఆదేశం

    Published on

    అక్షరటుడే, హైదరాబాద్​: CM Revanth Reddy | రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. అల్పపీడనం బలపడడంతో రాష్ట్రంలోని కొన్ని జిల్లాలో విస్తారంగా వర్షాలు (Heavy rains) కురుస్తున్నాయి. మెదక్ (Medak)​, కామారెడ్డి (Kamareddy) జిల్లాల్లో బుధవారం కుండపోత వర్షం కురిసింది. దీంతో సీఎం రేవంత్​రెడ్డి స్పందించారు.

    CM Revanth Reddy | అప్రమత్తంగా ఉండాలని సూచన..

    వర్షాలు కురుస్తున్న కామారెడ్డి, మెదక్ జిల్లాల్లో పరిస్థితిని సీఎం రేవంత్​రెడ్డి ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. అధికారుల ద్వారా వివరాలు అడిగి తెలుసుకుంటున్నారు. భారీ వర్షాల నేపథ్యంలో మెదక్, కామారెడ్డి జిల్లాల్లో (Kamareddy Collector Ashish Sangwan) యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని ఆయా జిల్లాల కలెక్టర్లను ముఖ్యమంత్రి ఆదేశించారు.

    CM Revanth Reddy | అన్ని విభాగాలు సర్వసన్నద్ధంగా ఉండాలి..

    ఈ రెండు జిల్లాల్లో ఎలాంటి విపత్కర పరిస్థితులొచ్చినా ఎదుర్కొనేందుకు అన్ని విభాగాలు, అధికారులు సర్వసన్నద్ధంగా ఉండాలని సీఎం రేవంత్​రెడ్డి ఆదేశించారు. అనుకోని పరిస్థితి ఎదురైతే వెంటనే అవసరమైన సహాయక చర్యలను చేపట్టాలని సూచించారు. పరిస్థితులకు అనుగుణంగా ఎన్డీఆర్ఎఫ్ (NDRF), ఎస్డీఆర్ఎఫ్(SDRF) బృందాల సాయం తీసుకోవాలని సీఎం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ఆదేశించారు.

    CM Revanth Reddy | కామారెడ్డి, మెదక్​ జిల్లాల్లో..

    భారీవర్షాలు కామారెడ్డి, మెదక్​ జిల్లాలను అతలాకుతలం చేశాయి. బుధవారం తెల్లవారుజాము నుంచి కురుస్తున్న వర్షం కారణంగా వాగులు వంకలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. అలాగే లింగంపేటలో (Lingamper) పలు చెరువులు తెగిపోయాయి. మంజీర నది ఉధృతంగా ప్రవహిస్తోంది. నిజాంసాగర్​ ప్రాజెక్టు గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. వరదలో పలువురు చిక్కుకోవడంతో కలెక్టర్​ ఆశిష్​ సంగ్వాన్​ (Collector Ashish Sangwan) పర్యవేక్షణలో ఎస్పీ రాజేష్​ చంద్ర (SP Rajesh Chandra), సబ్​ కలెక్టర్​ కిరణ్మయి (Sub Collector Kiranmai) అప్రమత్తమయ్యారు. ఘటనా స్థలాలకు చేరుకుని సమీక్షించారు. పోలీసులు, ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది రెస్క్యూ ఆపరేషన్​ (Rescue operation) నిర్వహించారు. వరదల్లో చిక్కుకున్న వారిని సురక్షితంగా తరలించారు.

    Latest articles

    Kamareddy | తెగిన రోడ్లు.. కొట్టుకుపోయిన వాహనాలు.. కామారెడ్డిలో భయానక పరిస్థితి..

    అక్షరటుడే, కామారెడ్డి: Kamareddy | కామారెడ్డి జిల్లాలో భారీ వర్షం భయానక పరిస్థితి సృష్టించింది. జిల్లా చరిత్రలోనే అత్యధిక...

    Yellareddy | ఎల్లారెడ్డిలో వరద పరిస్థితిపై మంత్రి ఉత్తమ్​ సమీక్ష

    అక్షరటుడే, ఎల్లారెడ్డి: Yellareddy | రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా మెదక్​ (Medak), కామారెడ్డిలో (Kamareddy)...

    Pocharam Project | ప్రమాదం అంచున పోచారం ప్రాజెక్టు..

    అక్షరటుడే, ఎల్లారెడ్డి: Pocharam Project | భారీవర్షాల కారణంగా వరద తాకిడితో పోచారం ప్రాజెక్టుకు భారీ వరద వచ్చి...

    kamareddy | కామారెడ్డి జిల్లాలో రేపు పాఠశాలలకు సెలవు

    అక్షరటుడే, వెబ్​డెస్క్​: kamareddy | కామారెడ్డి జిల్లాను భారీ వర్షాలు తీవ్రంగా అతలాకుతం చేస్తున్నాయి. మంగళవారం రాత్రి ఎడతెరిపి...

    More like this