Homeజిల్లాలునిజామాబాద్​Limbadri Gutta | కమనీయం.. లక్ష్మీ నృసింహుని కల్యాణం

Limbadri Gutta | కమనీయం.. లక్ష్మీ నృసింహుని కల్యాణం

భీమ్‌గల్‌ లింబాద్రి గుట్టపై బ్రహ్మోత్సవాలు వైభవోపేతంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా శుక్రవారం స్వామివారి కల్యాణోత్సవం కనులపండువగా నిర్వహించారు.

- Advertisement -

అక్షరటుడే, భీమ్‌గల్: Limbadri Gutta | జిల్లాలోనే ప్రసిద్ధి చెందిన భీమ్‌గల్‌ నింబాచల క్షేత్ర శ్రీ లక్ష్మీ నృసింహుని (Sri Lakshmi Narasimha Swamy) బ్రహ్మోత్సవాలు వైభవోపేతంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా శుక్రవారం స్వామివారి కల్యాణోత్సవం కనులపండువగా జరిగింది.

ముందుగా ఉదయం గర్భాలయంలో ప్రధాన యాగ్నికుల ఆధ్వర్యంలో స్వర్ణాలంకార భూషితులైన శ్రీ లక్మీ నృసింహుని ఉత్సవ విగ్రహాలను మంగళ వాయిద్యాల నడుమ గర్భాలయం నుంచి కల్యాణ మండపానికి తీసుకొచ్చారు. పుష్ప మాలికలతో అలంకరించిన పల్లకిలో భక్తజన గోవింద నామ స్మరణతో మధ్య స్వామి వారి విగ్రహాలను తీసుకొచ్చారు.

Limbadri Gutta | వైభవంగా కల్యాణం..

కల్యాణోత్సవంలో భాగంగా మొదట కలశ పూజ, విశ్వక్సేన పూజ నిర్వహించి స్వామివారికి రక్షా బంధనం చేశారు. పంచామృతాలతో (Panchamrutham) అభిషేక పూజలు జరిపారు. అనంతరం కన్యాదానంలో భాగంగా శ్రీ లక్మీ నృసింహుని దోసిలిపై లక్మీ దేవి దోసిలిని ఉంచి కన్యాదానం తంతు జరిపించగా, భక్తజనం అధికసంఖ్యలో తరలివచ్చి తిలకించారు. కల్యాణం అనంతరం వివాహ స్థలిలో పాక హోమం నిర్వహించారు.

Limbadri Gutta | సర్వ సమాజ్‌ కమిటీ ఆధ్వర్యంలో పట్టు వస్త్రాలు..

భీమ్‌గల్‌ సర్వ సమాజ్‌ కమిటీ ఆధ్వర్యంలో శ్రీ లక్మీ నృసింహునికి పట్టు వస్త్రాలు సమర్పించారు. ఏటా స్వామివారి బ్రహ్మోత్సవాల్లో సర్వ సమాజ్‌ కమిటీ ఆధ్వర్యంలో పట్టు వస్త్రాలు (silk clothes) అందజేయడం ఆనవాయితీగా వస్తోంది. అధ్యక్షుడు నీలం రవి, ఉపాధ్యక్షుడు బర్ల మోహన్, కోశాధికారి కారికాపు కుమ్మరి హరీష్, సెక్రటరీ పర్శ నవీన్, సలహా కమిటీ సభ్యులు పాల్గొన్నారు.