ePaper
More
    HomeతెలంగాణLocal Body Elections | స్థానిక పోరుకు సై అంటున్న కమలదళం

    Local Body Elections | స్థానిక పోరుకు సై అంటున్న కమలదళం

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్: Local Body Elections | రాష్ట్రంలో త్వరలో స్థానిక ఎన్నికల (Local Body Elections) నగరా మోగనుంది. సెప్టెంబర్​ 30 లోపు పంచాయతీల ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వాన్ని హైకోర్టు (High Court) ఆదేశించిన విషయం తెలిసిందే. దీంతో ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం సిద్ధం అవుతోంది.

    ఎన్నికల కోసం అధికారులు, సిబ్బందికి శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నారు. మరోవైపు ఎన్నికల్లో బీసీలకు 42శాతం రిజర్వేషన్ల కోసం ప్రభుత్వం ఆర్డినెన్స్ (Government Ordinance)​ను గవర్నర్​ ఆమోదం కోసం పంపించింది. గవర్నర్ (Governer)​ సంతకం చేస్తే ఆ ఆర్డినెన్స్​ అమలులోకి రానుంది. అనంతరం ప్రభుత్వం స్థానిక ఎన్నిలకు నోటిఫికేషన్​ విడుదల చేసే అవకాశం ఉంది. ఈ క్రమంలో బీజేపీ నాయకులు స్థానిక సమరానికి సై అంటున్నారు.

    Local Body Elections | కొత్త అధ్యక్షుడికి సవాల్​

    బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా మాజీ ఎమ్మెల్సీ రాంచందర్​రావు (Former MLC Ramachandra Rao) ఇటీవల నియమితులైన విషయం తెలిసిందే. ఆయన నేతృత్వంలో పార్టీ స్థానిక ఎన్నికలకు సిద్ధం అవుతోంది. ఎక్కువ స్థానాల్లో విజయం సాధించడమే లక్ష్యంగా కాషాయ పార్టీ రోడ్ మ్యాప్​ సిద్ధం చేస్తోంది.

    ఈ మేరకు మంగళవారం బీజేపీ కార్యకర్తలకు శిక్షణా తరగతులు నిర్వహించారు. బీజేపీ జాతీయ కార్యదర్శి సునీల్ బన్సల్ (BJP National Secretary Sunil Bansal) ముఖ్య అతిథిగా హాజరై కార్యకర్తలకు దిశా నిర్దేశం చేశారు. స్థానిక ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించారు. బుధవారం కూడా వర్క్​షాప్​ కొనసాగుతోంది. ఇందులో భాగంగా జిల్లా, మండల స్థాయి కమిటీలను ఏర్పాటు చేయనున్నారు.

    Local Body Elections | సీనియర్లు సహకరిస్తారా..

    రాష్ట్ర బీజేపీలో నాయకుల మధ్య సమన్వయం కొరవడిందన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. రాష్ట్ర అధ్యక్ష పదవిని పలువురు నాయకులు ఆశించారు. అయితే కేంద్ర నాయకత్వం అనూహ్యంగా రాంచందర్​రావును ఎంపిక చేసింది. దీంతో పదవి ఆశించి భంగపడ్డ నాయకులు కొత్త అధ్యక్షుడికి సహకరిస్తారా.. లేదా అనేది తెలియాల్సి ఉంది. అందరు నాయకులను కలుపుకొని వెళ్తేనే స్థానిక ఎన్నికల్లో ఎక్కువ సీట్లు గెలిచే అవకాశం ఉంటుంది. కొత్త అధ్యక్షుడు పార్టీని గాడిన పెడతారా లేదా చూడాల్సి ఉంది.

    More like this

    Kamareddy | తల్లికి తలకొరివి పెట్టేందుకు కొడుకు వస్తే వెళ్లగొట్టిన గ్రామస్థులు.. ఎందుకో తెలుసా..?

    అక్షరటుడే, కామారెడ్డి: Kamareddy | తల్లిని కంటికి రెప్పలా కాపాడుకొని ఆసరాగా ఉండాల్సిన కొడుకు ఇరవై ఏళ్ల క్రితం...

    MP Arvind | ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు వేసిన ఎంపీ అర్వింద్​

    అక్షరటుడే, వెబ్​డెస్క్ ​: MP Arvind | ఉపరాష్ట్రపతి (Vice President) ఎన్నికల్లో నిజామాబాద్​ ఎంపీ అర్వింద్​ (MP...

    Vice President | ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో సీపీ రాధాకృష్ణన్​ ఘన విజయం

    అక్షరటుడే, వెబ్​డెస్క్ ​: Vice President | ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో (Vice President Elections) ఎన్డీఏ అభ్యర్థి సీపీ...