అక్షరటుడే, వెబ్‌డెస్క్: Kamal Haasan | ప్రముఖ నటుడు, మక్కల్ నీది మయ్యం పార్టీ అధినేత కమల్ హాసన్ శుక్రవారం పార్లమెంట్(Parliament)లోకి అడుగు పెట్టారు. ఇటీవల రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికైన ఆయనతో డిప్యూటీ చైర్మన్ హరివంశ్(Deputy Chairman Harivansh) ప్రమాణ స్వీకారం చేయించారు.
తోటి పార్లమెంటు సభ్యుల కరతాళ ధ్వనుల మధ్య కమల్ తమిళంలో ప్రమాణ స్వీకారం చేశారు. ప్రమాణ స్వీకారం అనంతరం కమల్ పార్లమెంటు వెలుపల విలేకరులతో మాట్లాడారు. నేను చాలా గర్వంగా, గౌరవంగా ఉన్నానని 69 ఏళ్ల విశ్వవిఖ్యాత నటుడు తెలిపారు.
Kamal Haasan | సినిమాల నుంచి రాజకీయాలకు..
తమిళనాడుకు చెందిన కమల్ హాసన్(Kamal Haasan) నటనలో తనదైన ముద్ర వేశారు. సినీ ఇండస్ట్రీలో సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన వివిధ భాషల్లో నటించారు. తన వైవిధ్యపరమైన నటనతో దక్షిణాదినే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్నారు.
బీజేపీని తొలి నుంచి వ్యతిరేకించే ఆయన రాజకీయాల్లోకి అడుగు పెట్టారు. తమిళనాడులో మక్కల్ నీది మయ్యం పార్టీని (Makkal Needi Mayyam Party) స్థాపించారు. 2021 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో (Assembly Elections) ఆయన పార్టీ ఘోరంగా ఓడిపోయింది. 2.62% ఓట్లను సాధించింది. కానీ ఒక్కసీటును గెలుచుకోలేకపోయింది. మొన్నటి లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయక పోయినా కూడా డీఎంకేకు మద్దతుగా నిలిచారు. ఈ నేపథ్యంలోనే ఆయనకు డీఎంకే రాజ్యసభ సభ్యుడిగా (Rajya Sabha Member) అవకాశం కల్పించింది. రాజ్యసభలోకి ప్రవేశించడం కమల్ హాసన్ రాజకీయ జీవితంలో ప్రధాన మైలురాయిగా నిలిచింది.