అక్షరటుడే, వెబ్‌డెస్క్:Kamal Haasan | తమిళ నాట రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. ప్రముఖ నటుడు, మక్కల్ నీది మయ్యం పార్టీ వ్యవస్థాపకుడు కమల్‌హాసన్ రాజ్యసభ(Rajya Sabha)కు వెళ్లనున్నారు.
డీఎంకే తరఫున ఆయనకు రాజ్యసభ సీటు ఇస్తున్నట్లు తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్(Tamil Nadu Chief Minister Stalin) ప్రకటించారు. 2024 లోక్‌సభ ఎన్నికల వేళ డీఎంకే, ఎంఎన్ఎం మధ్య ఒప్పందం కుదిరింది. ఇందులో భాగంగా కమల్ పార్టీకి ఒక రాజ్యసభ సీటు ఇస్తామని డీఎంకే(DMK) అంగీకరించింది. ఈ క్రమంలో తాజాగా తమిళనాడు నుంచి ఖాళీ అవుతున్న నాలుగు రాజ్యసభ సీట్లలో ఒకదానిని మక్కల్ నీది మయ్యం పార్టీ (Makkal Needhi Maiam Party) కేటాయించింది. ఈ క్రమంలో కమల్ హాసన్‌ను రాజ్యసభ అభ్యర్థిగా స్టాలిన్ ప్రకటించారు.