అక్షరటుడే, భీమ్‌గల్ : Kalyana Lakshmi Approvals | నియోజకవర్గ పరిధిలోని పలు మండలాలకు చెందిన కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాల (Shaadi Mubarak Scheme) లబ్ధిదారులకు ఊరట లభించింది. మంజూరుకు సిద్ధంగా ఉన్న మొత్తం 207 ఫైళ్లపై మాజీ మంత్రి, స్థానిక ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి (Vemula Prashanth Reddy) గురువారం వేల్పూర్‌లోని తన నివాసంలో సంతకాలు చేశారు. నియోజకవర్గంలోని ఎనిమిది మండలాలకు చెందిన తహశీల్దార్లు ఈ క్రతువులో పాల్గొన్నారు.
Kalyana Lakshmi Approvals | మండలాల వారీగా వివరాలు..
కమ్మర్‌పల్లిలో (Kammarpally) 28 దరఖాస్తులు, బాల్కొండ 38, ముప్కాల్ 7, మోర్తాడ్ 29, వేల్పూర్ 55, మెండోరా 17, భీమ్‌గల్ 21, ఏర్గట్ల 12 మండలాలకు సంబంధించిన దరఖాస్తులను ఎమ్మెల్యే క్షుణ్ణంగా పరిశీలించి ఆమోదముద్ర వేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ.. పేదల పెళ్లిళ్లకు ఆసరాగా నిలిచే ఈ పథకానికి సంబంధించిన ఫైళ్లను అధికారులు తమ వద్ద పెండింగ్‌లో ఉంచుకోకూడదని స్పష్టం చేశారు. త్వరితగతిన సంతకాలు పూర్తి చేసి, నిధుల విడుదల కోసం వెంటనే ప్రభుత్వానికి నివేదికలు పంపాలని తహశీల్దార్లను ఆదేశించారు. లబ్ధిదారులకు సకాలంలో చెక్కులు అందేలా చూడాల్సిన బాధ్యత అధికారులపై ఉందన్నారు. కార్యక్రమంలో నియోజకవర్గంలోని అన్ని మండలాల తహశీల్దార్లు, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.