అక్షరటుడే, నిజాంసాగర్: Kalyana lakshmi | పేదలకు కల్యాణ లక్ష్మి పథకం వరంలాంటిదని ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు (MLA Thota Lakshmi Kantha Rao) అన్నారు. పిట్లం మార్కెట్ యార్డు (Pitlam Market Yard) ఆవరణంలో పిట్లం(Pitlam), నిజాంసాగర్(Nizamasagar) మండలాలకు చెందిన లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్(Shadi Mubarak) చెక్కులను అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం అన్నివర్గాలకు సమన్యాయం చేయడమే లక్ష్యంగా ముందుకు వెళ్తోందన్నారు. నిజాంసాగర్ మండలంలోని 11 మంది లబ్ధిదారులకు దళితబంధు చెక్కులను అందజేశారు. ఆయన వెంట పిట్లం మార్కెట్ కమిటీ ఛైర్మన్ మనోజ్‌కుమార్, కాంగ్రెస్ పార్టీ నిజాంసాగర్, మహమ్మద్ నగర్ మండలాల అధ్యక్షుడు ఏలె మల్లిఖార్జున్, రవీందర్ రెడ్డి, రెండు మండలాల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
