Kalvakuntla Kavitha | హరీశ్​రావు గుంట నక్క.. కవిత హాట్ కామెంట్స్

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Kalvakuntla Kavitha | తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత (Kalvakuntla Kavitha) మరోసారి మాజీ మంత్రి హరీశ్​రావుపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఆయనను గుంట నక్క అన్నారు. జాగృతి జనంబాట కార్యక్రమంలో భాగంగా కవిత ఆదివారం సూర్యాపేటలో మీడియాతో మాట్లాడారు. కర్ణాటక ప్రభుత్వం (Karnataka government) ఆల్మట్టి ఎత్తు పెంచాలని నిర్ణయిస్తే కాంగ్రెస్​ ప్రభుత్వం ఎలాంటి చర్యలు చేపట్టలేదన్నారు. నారాయణఖేడ్​–మక్తాల్ ఎత్తిపోతలకు జూరాల నుంచి ఇంటెక్​ పాయింట్​ మార్చుకోవాలన్నారు. అలా చేస్తే […]

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Kalvakuntla Kavitha | తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత (Kalvakuntla Kavitha) మరోసారి మాజీ మంత్రి హరీశ్​రావుపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఆయనను గుంట నక్క అన్నారు.

జాగృతి జనంబాట కార్యక్రమంలో భాగంగా కవిత ఆదివారం సూర్యాపేటలో మీడియాతో మాట్లాడారు. కర్ణాటక ప్రభుత్వం (Karnataka government) ఆల్మట్టి ఎత్తు పెంచాలని నిర్ణయిస్తే కాంగ్రెస్​ ప్రభుత్వం ఎలాంటి చర్యలు చేపట్టలేదన్నారు. నారాయణఖేడ్​–మక్తాల్ ఎత్తిపోతలకు జూరాల నుంచి ఇంటెక్​ పాయింట్​ మార్చుకోవాలన్నారు. అలా చేస్తే రంగారెడ్డి, పాలమూరు జిల్లాలకు మేలు జరుగుతుందన్నారు.

Kalvakuntla Kavitha | బీఆర్​ఎస్​ను ఎవరు కాపాడలేరు

బీఆర్​ఎస్​ అసెంబ్లీ సమావేశాలను (assembly sessions) బహిష్కరించిన విషయం తెలిసిందే. దీనిపై కవిత స్పందించారు. ‘గుంటనక్క హరీశ్​రావును సీఎం రేవంత్​రెడ్డి వ్యక్తిగతంగా ఒక్క మాట అన్నందుకు సభను బహిష్కరించారని’ అన్నారు. అసెంబ్లీలో కీలక అంశంపై చర్చ జరుగుతుంటే సభలో ప్రతిపక్షం ఉండాల్సిన అవసరం లేదా అని ప్రశ్నించారు. ప్రతిపక్షం అంటే పార్టీ మాత్రమే కాదు, ప్రజల గొంతుక అన్నారు. కేసీఆర్​ని సీఎం రేవంత్ ఎన్ని తిట్లు తిట్టారని, అప్పుడు హరీశ్​రావు ఎప్పుడైనా బాయ్ కాట్ చేశారా అని ప్రశ్నించారు. గుంటనక్క హరీశ్​రావుకు డిప్యూటీ ఫ్లోర్ లీడర్ ఇవ్వగానే బీఆర్ఎస్ పార్టీని ఎవరూ కాపాడలేరని తాను చెప్పినట్లు గుర్తు చేశారు.

జీహెచ్​ఎంసీ వార్డుల పెంపు బిల్లును ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశ పెట్టిందన్నారు. హైదరాబాద్​ నగరానికి సంబంధించి కీలక బిల్లుపై చర్చలో ప్రతిపక్షం ఎందుకు పాల్గొనలేదన్నారు. కృష్ణా జలాలపై పెద్ద సభలు పెట్టాలి అనుకుంటున్న బీఆర్​ఎస్​.. చట్ట సభల్లో ఎందుకు మాట్లాడలేదని నిలదీశారు. బీఆర్​ఎస్​లో తోక కుక్కను ఊపే పరిస్థితి వచ్చిందన్నారు. సభలో కాంగ్రెస్​ అబద్ధాలు చెప్పిందన్నారు. ప్రతిపక్ష బీఆర్​ఎస్​ సభలో ఉండి వాటిని ఖండించకుండా వాకౌట్​ చేయడం సరికాదని పేర్కొన్నారు.

Kalvakuntla Kavitha | సంతకం ఎందుకు చేశారు

పాలమూరు నీటి సమస్యలపై హరీశ్​రావును ప్రశ్నిస్తూ తెలంగాణకు 3 శాతం తక్కువ నీటి వాటా లభించేలా 2016లో ఆయన ఎందుకు ఒప్పందంపై సంతకం చేశారని కవిత ప్రశ్నించారు. నీటి వనరుల పాయింట్‌ను జూరాల నుంచి శ్రీశైలానికి ఎందుకు మార్చారన్నారు. హరీశ్​ రావు ఆర్థిక ప్రయోజనాల కోసమే కల్వకుర్తి వంటి ప్రాజెక్టులను నిర్లక్ష్యం చేశారని ఆరోపించారు.

Related articles

The Wedding of VIROSH : పెళ్లి చేసుకోనున్నట్లు ప్రకటించిన విజయ్-రష్మిక.. ఎప్పుడంటే!

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: The Wedding of VIROSH | టాలివుడ్​ నటులు విజయ్ దేవరకొండ, రష్మిక ఎట్టకేలకు తమ వివాహ బంధం వేడుకను ప్రకటించారు....

Flag march | బాన్సువాడలో ఫ్లాగ్​ మార్చ్​.. 19 మంది నిందితుల అరెస్టు

అక్షరటుడే, బాన్సువాడ: Flag march | కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణంలో ఇటీవల చోటుచేసుకున్న ఘటన నేపథ్యంలో ఏర్పడిన ఉద్రిక్త పరిస్థితులను జిల్లా పోలీస్...

Hydraa Commissioner Ranganath | రూ.70 వేల కోట్లకు పైగా విలువైన 1,350 ఎకరాల స్థలాలను రక్షించాం : హైడ్రా కమిషనర్​ రంగనాథ్​

అక్షరటుడే, హైదరాబాద్​: Hydraa Commissioner Ranganath | గ్రేటర్​ హైదరాబాద్​లో ఇప్పటివరకు దాదాపు 1,350 ఎకరాల స్థలాలను కబ్జాదారుల కోరల నుంచి కాపాడినట్లు హైడ్రా కమిషనర్...

Hitler police station | పోలీస్​ ఠాణాగా హిట్లర్​ హోం.. రూ. 247 కోట్లతో రెనోవేషన్​!

ఆస్ట్రియా దేశ సర్కారు కీలక నిర్ణయం తీసుకుంది. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన  జర్మనీ నియంత అడాల్ఫ్ హిట్లర్ పుట్టిన ఇంటిని పోలీస్ ఠాణాగా మార్చాలని నిర్ణయించింది.