అక్షరటుడే, ఇందూరు: Kalvakuntla Kavitha | ఇటీవల రౌడీషీటర్ రియాజ్ దాడిలో మృతిచెందిన సీసీఎస్ కానిస్టేబుల్ ప్రమోద్ (CCS Constable Pramod) కుటుంబాన్ని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆదివారం పరామర్శించారు. ఈ సందర్భంగా ప్రమోద్ సతీమణితో మాట్లాడారు. చిన్నారుల బాగోగులను తెలుసుకున్నారు. జాగృతి (Telanagana Jagruthi) పరంగా బాధిత కుటుంబానికి అండగా ఉంటామని హామీనిచ్చారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం, పోలీస్‌శాఖ కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని పేర్కొన్నారు.
రౌడీషీటర్ రియాజ్‌ను విచారణ నిమిత్తం పోలీస్‌స్టేషన్‌కు తీసుకెళ్తుండగా సీసీఎస్ కానిస్టేబుల్ ప్రమోద్‌పై దాడిచేయగా కానిస్టేబుల్ సంఘటనా స్థలంలోనే మృతిచెందిన విషయం తెలిసిందే. అనంతరం రెండు రోజుల తర్వాత నిజామాబాద్ జీజీహెచ్‌లో తప్పించుకునేందుకు ప్రయత్నించిన క్రమంలో పోలీసుల కాల్పుల్లో రౌడీషీటర్ రియాజ్ సైతం హతమైన విషయం విదితమే.

