అక్షరటుడే, వెబ్డెస్క్ : Kalvakuntla Kavitha protest | మోసానికి మారుపేరు కాంగ్రెస్ అని తెలంగాణ జాగృతి (Telangana Jagruti) అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత (Kavitha) అన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను సీఎం రేవంత్రెడ్డి వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
హైదరాబాద్లోని ప్రజా భవన్ (Praja Bhavan) ఎదుట కల్వకుంట్ల కవిత మహిళలతో నిరసన చేపట్టారు. మహిళలకు ఎన్నికల హామీలను నెరవేర్చాలని డిమాండ్ డిమాండ్ చేశారు. కాంగ్రెస్ (Congress) అధికారంలోకి వచ్చి 26 నెలలు అవుతోందన్నారు. కానీ మహిళలకు నెలకు రూ.2,500, తులం బంగారం, విద్యార్థినులకు స్కూటీలు, రూ.4వేల పింఛన్ పెంపు హామీని మాత్రం అమలు చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ హామీల అమలుకు రాబోయే బడ్జెట్ (Telangana Budget)లో నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు. ఈ నిరసనలో దాదాపు వెయ్యి మంది మహిళలు పాల్గొన్నారు. అనంతరం ఆమె అధికారులకు మెమోరాండం సమర్పించారు.
Kalvakuntla Kavitha protest | అంగన్వాడీల సమస్యలపై..
తెలంగాణ అంగన్వాడీ టీచర్లు, ఆశా కార్యకర్తలకు ఇచ్చిన వాగ్దానాలను నెరవేర్చాలని కవిత డిమాండ్ చేశారు. అంగన్వాడీల పర్యవేక్షణ సర్పంచులకు, వార్డు మెంబర్లకు అప్పచెప్పడం అంగన్వాడీ ఉద్యోగస్తుల ఆత్మ గౌరవాన్ని దెబ్బ తీసేలా ఉందన్నారు. తక్షణమే ఈ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని కవిత డిమాండ్ చేశారు. ఐసీడీఎస్ అధికారులు ఆయా సెంటర్లను పర్యవేక్షిస్తారని చెప్పారు. అంగన్వాడీ టీచర్లు ఇప్పటికే అనేక పనులు చేస్తున్నారని తెలిపారు. వాళ్లపై రాజకీయ జోక్యం సరికాదన్నారు. అంగన్వాడీ టీచర్లు, ఆశవర్కర్లకు పెండింగ్ జీతాలు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.