Kalvakuntla Kavitha New Party | గద్వాల నుంచే కొత్త పార్టీ : కల్వకుంట్ల కవిత

జోగులాంబ గద్వాల జిల్లా నుంచే తాను కొత్త పార్టీ పెడతానని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అన్నారు. జాగృతి ఆధ్వర్యంలో గద్వాలలో నిర్వహించిన రైతు సంఘర్షణ సభలో ఆమె మాట్లాడారు

అక్షరటుడే, వెబ్​డెస్క్: Kalvakuntla Kavitha New Party | జోగులాంబ గద్వాల జిల్లా (Jogulamba Gadwal District) నుంచే తాను కొత్త పార్టీ పెడతానని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అన్నారు. జాగృతి ఆధ్వర్యంలో గద్వాలలో నిర్వహించిన రైతు సంఘర్షణ సభలో ఆమె మాట్లాడారు.

తెలంగాణ ఉద్యమ సమయంలో ఏది జరిగిన ఉత్తర తెలంగాణలోని కరీంనగర్​ (Karimnagar)లో ప్రారంభం అయ్యేదని కవిత గుర్తు చేశారు. కానీ భవిష్యత్​లో తాను ఏర్పాటు చేయనున్న పార్టీకి సంబంధించి ఏ కార్యక్రమం జరిగిన జోగులాంబ గద్వాల జిల్లా నుంచి ప్రారంభిస్తానని చెప్పారు. అందులో భాగంగా రైతు సంఘర్షన సభ పెట్టినట్లు చెప్పారు. నడిగడ్డ ప్రజలు నిజాయితీ గల బిడ్డలు అన్నారు. కష్టాన్ని నమ్ముకొని బతుకుతున్నారని పేర్కొన్నారు. ఇలాంటి గడ్డపై నుంచి ఎలాంటి పని చేసిన జోగులాంబ అమ్మవారి ఆశీస్సులు ఉంటాయన్నారు.

Kalvakuntla Kavitha New Party | ఎన్నికల్లో పోటీ చేస్తాం

రానున్న ఎంపీటీసీ ,జెడ్పీటీసీ ఎన్నికల్లో పోటీ చేస్తామని కవిత తెలిపారు. ఎన్నికల్లో ఎవరు ఏం ఇచ్చినా.. తీసుకోవాలన్నారు. కానీ పని చేసే వారికి ఓటు వేయాలని సూచించారు. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో (ZPTC Elections) డబ్బులు ఇస్తే తీసుకోవాలన్నారు. ఓటు మాత్రం జాగృతికి వేయాలని కోరారు. ప్రతి మండలంలో జెడ్పీటీసీలను నిలుపుతామని ఆమె తెలిపారు.

Kalvakuntla Kavitha New Party | బీఆర్​ఎస్​ మోసం చేసింది

బీఆర్​ఎస్​ పార్టీ (BRS Party) నడిగడ్డను మోసం చేసిందని కవిత పేర్కొన్నారు. ఈ గడ్డకు నీళ్లు ఇవ్వడంలో బీఆర్​ఎస్​, కాంగ్రెస్​ విఫలం అయ్యాయని విమర్శించారు. కొత్తగా వచ్చే రాజకీయ శక్తిగా తాము నడిగడ్డకు నీళ్లు తెస్తామన్నారు. తుంగభద్ర, కృష్ణ నదులు పారుతున్నా.. నడిగడ్డకు నీరు రావడం లేదన్నారు. గద్వాల ఎమ్మెల్యే (Gadwal MLA)కు దమ్ముంటే ఏ పార్టీలో ఉన్నారో చెప్పాలని సవాల్ చేశారు. ఏ పార్టీలో ఉన్నారో చెప్పుకోలేని ఎమ్మెల్యే వెంటనే రాజీనామా చేయాలన్నారు.

Kalvakuntla Kavitha New Party | బకాయిలు చెల్లించాలి

ఆడవాళ్లు లేనిదే వ్యవసాయం లేదని కల్వకుంట్ల కవిత అన్నారు. మహిళా రైతులు ఓ వైపు ఇల్లు, మరోవైపు వ్యవసాయం చూసుకుంటున్నారని చెప్పారు. ఎంతో కష్టపడి రైతులు సాగు చేస్తుంటే దళారులు వారిని దగ చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. జోగులాంబ గద్వాల జిల్లాలో సీడ్​ పత్తి రైతులను దళారులు మోసం చేస్తున్నారని పేర్కొన్నారు. వారం రోజుల్లో సీడ్​ పత్తి రైతుల బకాయిలు విడుదల చేయాలని డిమాండ్​ చేశారు. లేకపోతే దీక్ష చేస్తామని హెచ్చరించారు.

Kalvakuntla Kavitha New Party | ఆపరేషన్​ కగార్​పై..

ఏ రాజ్యం అయినా ఇద్దరు అన్నలకు భయపడుతుందన్నారు కవిత. ఒకరు అడవిలో ఉండే అన్నలని, ఇంకొకరు రైతన్నలని పేర్కొన్నారు. అడవిలో ఉండే అన్నలకు భయపడి వారిని అణచివేసే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. పరిశ్రమలకు కరెంట్ ఇస్తున్న ప్రభుత్వం.. రైతులకు ఇవ్వడం లేదన్నారు. ప్రభుత్వానికి యూరియా ఇవ్వడం చేతగాక యాప్​ పేరిట రైతులను ఇబ్బంది పెడుతోందని విమర్శించారు. రైతు భరోసా (Rythu Bharosa) ఎన్నికల కోసం ఇచ్చే గిఫ్ట్​ అయిందన్నారు. వెంటనే యాసంగి సీజన్​కు సంబంధించి రైతు భరోసా నిధులు విడుదల చేయాలని డిమాండ్​ చేశారు.

Related articles

Kamareddy DMHO Appointment | కామారెడ్డి డీఎంహెచ్​వోగా రవీందర్ గౌడ్

కామారెడ్డి డీఎంహెచ్​వోగా డాక్టర్ రవీందర్ గౌడ్​ నియమితులయ్యారు. ఈ మేరకు డైరెక్టర్ ఆఫ్ హెల్త్ డిపార్ట్​మెంట్​ నుంచి ఉత్తర్వులు జారీ అయ్యాయి.

Sensex Nifty Gains | లాభాలతో ముగిసిన సూచీలు

దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాల బాటలో పయనించాయి. సెన్సెక్స్ 479 పాయింట్లు, నిఫ్టీ 141 పాయింట్లు లాభపడ్డాయి.

MLA Resignation Demand | ఎమ్మెల్యేను రాజీనామా చేయించడానికే వచ్చాం: ఎన్​ఎస్​యూఐ జిల్లా అధ్యక్షుడు సందీప్​

ప్రభుత్వ కళాశాలకు సంబంధించి అన్ని ఆధారాలతో వచ్చామని.. ఇచ్చిన హామీ మేరకు ఎమ్మెల్యే రాజీనామా చేయాలని ఎన్​ఎస్​యూఐ జిల్లా అధ్యక్షుడు సందీప్​ అన్నారు. కలెక్టరేట్​ ఎదుట ఆయన మీడియాతో మాట్లాడారు.

Kamareddy corruption free governance | కామారెడ్డిలో అవినీతి రహిత పాలన అందించాలి: ప్రభుత్వ సలహాదారు షబ్బీర్​ అలీ

అక్షరటుడే, కామారెడ్డి: Kamareddy corruption free governance | కామారెడ్డి పట్టణ ప్రజలకు (Kamareddy Municipality) అవినీతి రహిత పాలన అందించాలని కొత్తగా బాధ్యతలు...