అక్షరటుడే, వెబ్‌డెస్క్: Kalvakuntla Kavitha | ‘తెలంగాణ యాత్ర’ (Telangana Yatra) పేరుతో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత (Kalvakuntla Kavitha) రాష్ట్ర పర్యటనకు శ్రీకారం చుట్టారు. అక్టోబర్ చివరి వారంలో యాత్ర ప్రారంభించనున్నట్లు తెలుస్తోంది. తెలంగాణలోని అన్నిజిల్లాల మీదుగా యాత్ర ఉండనున్నట్లు సమాచారం. ఈ సందర్భంగా ఆయా జిల్లాల్లో ప్రజల కష్టాలను నేరుగా తెలుసుకునే ప్రయత్నం చేయనున్నారు.
Kalvakuntla Kavitha | మేధావులు, విద్యావంతులతో భేటీలు..
యాత్రలో భాగంగా ఆయా జిల్లాల్లో ఆమె పలువురు మేధావులు.. విద్యావంతులతో భేటీలు నిర్వహించనున్నారు. పలు వేదికలపై ప్రసంగించనున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ (Congress government) వైఫల్యాలను ఎండగడుతూ.. జాగృతి ఆధ్వర్యంలో ఏళ్లుగా చేస్తున్న సేవలను వివరించనున్నారు. యాత్రకు సంబంధించి బుధవారం స్పష్టమైన వివరాలు వెల్లడయ్యే అవకాశాలున్నాయి.
Kalvakuntla Kavitha | కేసీఆర్ ఫొటో లేకుండానే..
బీఆర్ఎస్లో హరీష్‌రావు, సంతోష్‌రావులపై తీవ్రమైన ఆరోపణలు చేసిన అనంతరం ఆమెపై పార్టీ వేటు వేసింది. ఈ సందర్భంగా ఆమె నెలకొల్పిన తెలంగాణ జాగృతి (Telangana Jagruti) సంస్థను బలోపేతం చేసేందుకు ప్రణాళికలు వేస్తున్నారు. దీంట్లో భాగంగానే రాష్ట్రమంతా పర్యటించేందుకు సిద్ధమయ్యారు. ముఖ్యంగా కేసీఆర్ ఆనవాళ్లు లేకుండా ప్రొఫెసర్ జయశంకర్ ఫొటోతో యాత్ర పోస్లర్లు రిలీజ్ చేసే ప్రణాళికతో ఉన్నట్లు సమాచారం. ఇదే జరిగితే ఆమె తన కుటుంబాన్ని పూర్తిగా పక్కకు పెట్టి రాజకీయాల్లో ముందుకు సాగనున్నట్లు అర్థమవుతోంది.