అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Kalvakuntla Kavitha | తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత (Kalvakuntla Kavitha) మరోసారి మాజీ మంత్రి హరీశ్‌రావుపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఆయనను గుంట నక్క అన్నారు.
జాగృతి జనంబాట కార్యక్రమంలో భాగంగా కవిత ఆదివారం సూర్యాపేటలో మీడియాతో మాట్లాడారు. కర్ణాటక ప్రభుత్వం (Karnataka government) ఆల్మట్టి ఎత్తు పెంచాలని నిర్ణయిస్తే కాంగ్రెస్ ప్రభుత్వం ఎలాంటి చర్యలు చేపట్టలేదన్నారు. నారాయణఖేడ్–మక్తాల్ ఎత్తిపోతలకు జూరాల నుంచి ఇంటెక్ పాయింట్ మార్చుకోవాలన్నారు. అలా చేస్తే రంగారెడ్డి, పాలమూరు జిల్లాలకు మేలు జరుగుతుందన్నారు.
Kalvakuntla Kavitha | బీఆర్ఎస్ను ఎవరు కాపాడలేరు
బీఆర్ఎస్ అసెంబ్లీ సమావేశాలను (assembly sessions) బహిష్కరించిన విషయం తెలిసిందే. దీనిపై కవిత స్పందించారు. ‘గుంటనక్క హరీశ్‌రావును సీఎం రేవంత్‌రెడ్డి వ్యక్తిగతంగా ఒక్క మాట అన్నందుకు సభను బహిష్కరించారని’ అన్నారు. అసెంబ్లీలో కీలక అంశంపై చర్చ జరుగుతుంటే సభలో ప్రతిపక్షం ఉండాల్సిన అవసరం లేదా అని ప్రశ్నించారు. ప్రతిపక్షం అంటే పార్టీ మాత్రమే కాదు, ప్రజల గొంతుక అన్నారు. కేసీఆర్‌ని సీఎం రేవంత్ ఎన్ని తిట్లు తిట్టారని, అప్పుడు హరీశ్‌రావు ఎప్పుడైనా బాయ్ కాట్ చేశారా అని ప్రశ్నించారు. గుంటనక్క హరీశ్‌రావుకు డిప్యూటీ ఫ్లోర్ లీడర్ ఇవ్వగానే బీఆర్ఎస్ పార్టీని ఎవరూ కాపాడలేరని తాను చెప్పినట్లు గుర్తు చేశారు.
జీహెచ్ఎంసీ వార్డుల పెంపు బిల్లును ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశ పెట్టిందన్నారు. హైదరాబాద్ నగరానికి సంబంధించి కీలక బిల్లుపై చర్చలో ప్రతిపక్షం ఎందుకు పాల్గొనలేదన్నారు. కృష్ణా జలాలపై పెద్ద సభలు పెట్టాలి అనుకుంటున్న బీఆర్ఎస్.. చట్ట సభల్లో ఎందుకు మాట్లాడలేదని నిలదీశారు. బీఆర్ఎస్లో తోక కుక్కను ఊపే పరిస్థితి వచ్చిందన్నారు. సభలో కాంగ్రెస్ అబద్ధాలు చెప్పిందన్నారు. ప్రతిపక్ష బీఆర్ఎస్ సభలో ఉండి వాటిని ఖండించకుండా వాకౌట్ చేయడం సరికాదని పేర్కొన్నారు.
Kalvakuntla Kavitha | సంతకం ఎందుకు చేశారు
పాలమూరు నీటి సమస్యలపై హరీశ్‌రావును ప్రశ్నిస్తూ తెలంగాణకు 3 శాతం తక్కువ నీటి వాటా లభించేలా 2016లో ఆయన ఎందుకు ఒప్పందంపై సంతకం చేశారని కవిత ప్రశ్నించారు. నీటి వనరుల పాయింట్‌ను జూరాల నుంచి శ్రీశైలానికి ఎందుకు మార్చారన్నారు. హరీశ్ రావు ఆర్థిక ప్రయోజనాల కోసమే కల్వకుర్తి వంటి ప్రాజెక్టులను నిర్లక్ష్యం చేశారని ఆరోపించారు.