అక్షరటుడే, ఎల్లారెడ్డి: KALOJI | తెలంగాణ బతుకుకు వన్నెతెచ్చిన కవి కాళోజీ అని ఎల్లారెడ్డి ప్రభుత్వ డిగ్రీ కళాశాల (Government Degree College) ప్రిన్సిపాల్ లక్ష్మీనారాయణ పేర్కొన్నారు. తెలంగాణ భాషా దినోత్సవాన్ని (Telangana Language Day) కళాశాలలో మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజాకవి కాళోజీ చిత్రపటానికి నివాళులర్పించారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ అచ్చమైన ప్రజాకవి కాళోజీ అని అభివర్ణించారు. నిజాంకు వ్యతిరేకంగా కవితలు రాసి ప్రజలను మేల్కొల్పిన వీరుడు ఆయన అని పేర్కొన్నారు. కళాశాలలో తెలుగుశాఖ అధ్యక్షుడు, ఐక్యూఏసీ సమన్వయకర్త డాక్టర్ శంకరయ్య (Dr. Shankaraiah) కాళోజీ జీవితం, వ్యక్తిత్వం గురించి వివరించారు. పుట్టుక నీది, చావు నీది.. బతకంతా దేశానిది అన్నట్లుగా ఆయన జీవించారని చెబుతూ కాళోజీ రాసిన కవితలు వినిపించారు.
ఈ కార్యక్రమాన్ని కళాశాల సాంస్కృతిక విభాగ సభ్యుడు చంద్రకాంత్ సమన్వయ పర్చారు. అధ్యాపకులు డాక్టర్ అరుణ్ కుమార్, నాగానిక, డాక్టర్ సిద్ధురాజు, సంతోష్, డాక్టర్ గంగారెడ్డి, కృష్ణ ప్రసాద్, రాణి, డాక్టర్ గోదావరి, సంగీత, స్వప్న, సురేశ్ రెడ్డి, మొయిన్, కిరణ్ కుమార్, మహమూద్, రాజు, దశరథ్, విద్యార్థులు పాల్గొన్నారు.