అక్షరటుడే, హైదరాబాద్: Kaloji Literary Award | ప్రజాకవి, పద్మ విభూషణ్ కాళోజీ నారాయణ రావు Kaloji Narayana Rao పేరిట తెలంగాణ సర్కారు ఏటా సాహితీ పురస్కారం అందజేస్తోంది.
ప్రతిష్ఠాత్మకమైన ఈ సాహితీ పురస్కారం – 2025 సంవత్సరానికి గాను కవయిత్రి, రచయిత్రి నెల్లుట్ల రమాదేవి Nellutla Ramadevi ఎంపికయ్యారు.
ఈ మేరకు ఆమెకు ముఖ్యమంత్రి CM రేవంత్ రెడ్డి అభినందనలు తెలియజేశారు. భాషా సాంస్కృతిక శాఖ ద్వారా ఏటా ప్రతిష్ఠాత్మకమైన కాళోజీ నారాయణరావు సాహితీ పురస్కారం ప్రదానం చేస్తున్నారు.
Kaloji Literary Award | అందెశ్రీ అధ్యక్షతన..
ప్రజా కవి, తెలంగాణ రాష్ట్ర గీత రచయిత అందెశ్రీ Andesri అధ్యక్షతన ఏర్పాటైన నిపుణుల కమిటీ.. 2025 సంవత్సరానికి ప్రముఖ కవయిత్రి నెల్లుట్ల రమాదేవిని ఎంపిక చేసింది.
కమిటీ ఎంపికను ఆమోదించిన ముఖ్యమంత్రి.. రమాదేవికి అభినందనలు తెలిపారు. సెప్టెంబరు 9, 2025 రవీంద్రభారతిలో జరిగే కాళోజీ జయంతి వేడుకలలో ఈ పురస్కారాన్ని అందజేయనున్నారు.