అక్షరటుడే నిజామాబాద్ సిటీ: Kaloji Jayanthi | నిజామాబాద్ కమిషనరేట్ పరిధిలో కాళోజీ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య (CP Sai Chaitnaya) ఆదేశానుసారం నిజామాబాద్ కమిషనరేట్ కార్యాలయంలో అదనపు డీసీపీ (అడ్మిన్) బస్వారెడ్డి (Additional DCP Baswareddy) ఆధ్వర్యంలో కాళోజీ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా డీసీపీ కాళోజీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ప్రజల గొడవను తన గొడవగా చేసుకొన్న ప్రజల కోసం పోరాటం చేసిన గొప్ప వ్యక్తి కాళోజీ అని వ్యాఖ్యానించారు.
ప్రజాకవిగానే మన్ననలు అందుకొన్న మహానీయుడు అని ఆయన పేర్కొన్నారు. కార్యక్రమంలో ఆఫీస్ సూపరింటెండెంట్ శంకర్, బషీర్, వనజ రాణి, రిజర్వ్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్, తిరుపతి, సీసీఆర్బీ, కంట్రోల్ రూం సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.