అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Kaleshwaram Commission | కాళేశ్వరం కమిషన్ నివేదిక సోమవారం మంత్రిమండలికి చేరనుంది. ఈ మేరకు మంత్రివర్గ సమావేశంలో కమిషన్ నివేదికపై చర్చించనున్నారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ (Kaleshwaram project) నిర్మాణంలో అవకతవకలు, మేడిగడ్డ కుంగిపోవడంపై విచారణకు ప్రభుత్వం పీసీ ఘోష్ ఛైర్మన్‌గా కమిషన్ ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దాదాపు 15 నెలల పాటు సుదీర్ఘంగా విచారణ చేపట్టిన కమిషన్ జులై 31న తన నివేదికను ప్రభుత్వానికి అందించింది.
కాళేశ్వరం కమిషన్ 115 మంది అధికారులు, మాజీ సీఎం కేసీఆర్ (former CM KCR), మాజీ మంత్రులు హరీశ్‌రావు, ఈటల రాజేందర్, పనులు చేపట్టిన కాంట్రాక్ట్ సంస్థ ప్రతినిధులను విచారించింది. సీల్డ్ కవర్లో తన నివేదికను సమర్పించింది. అయితే ఈ నివేదికను అధ్యయనం చేయడానికి ప్రభుత్వం నిపుణుల కమిటీని ఏర్పాటు చేసింది. అందజేయనుంది.
Kaleshwaram Commission | కమిటీ సభ్యులతో మంత్రి భేటీ
నిపుణుల కమిటీ సభ్యులతో మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి (Minister Uttam Kumar Reddy) ఆదివారం భేటీ కానున్నారు. కమిషన్ నివేదికపై ఇప్పటికే అధికారుల అధ్యయనం పూర్తయినట్లు సమాచారం. సాయంత్రానికి పూర్తిస్థాయిలో నివేదిక సమర్పించనున్నట్లు తెలుస్తోంది. దీంతో వారితో మంత్రి సమావేశమై చర్చించనున్నారు. అలాగే మంత్రి ఉత్తమ్ సీఎం రేవంత్‌రెడ్డితో (CM Revanth Reddy) సైతం సమావేశం అయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
Kaleshwaram Commission | ఎలాంటి చర్యలు తీసుకుంటారో..
కాళేశ్వరం ప్రాజెక్ట్‌లో భారీగా అక్రమాలు జరిగాయని కాంగ్రెస్ నాయకులు ఆరోపిస్తున్నారు. కేసీఆర్ కుటుంబం (KCR family) కమీషన్ల కోసమే దీనిని కట్టిందని సీఎం రేవంత్‌రెడ్డి సైతం పలుమార్లు వ్యాఖ్యానించారు. ఈ క్రమంలో కమిషన్ నివేదికపై ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందోననే ఉత్కంఠ నెలకొంది. మంత్రివర్గ సమావేశంలో కమిషన్ నివేదికపై చర్చించనున్నారు. అనంతరం ప్రభుత్వం వివరాలు వెల్లడించే అవకాశం ఉంది.