ePaper
More
    HomeతెలంగాణHarish Rao | కాళేశ్వరం నివేదిక అసెంబ్లీలో ప్రవేశ పెట్టొద్దు.. హైకోర్టును ఆశ్రయించిన హరీశ్​రావు

    Harish Rao | కాళేశ్వరం నివేదిక అసెంబ్లీలో ప్రవేశ పెట్టొద్దు.. హైకోర్టును ఆశ్రయించిన హరీశ్​రావు

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Harish Rao | తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు శనివారం ఉదయం ప్రారంభం అయ్యాయి. దివంగత ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్​కు సభలో సంతాపం తెలిపారు. అసెంబ్లీలో ప్రభుత్వం కాళేశ్వరం కమిషన్​ నివేదికను ప్రవేశ పెట్టడానికి సిద్ధం అయింది.

    ఈ నేపథ్యంలో మాజీ మంత్రి హరీశ్​రావు హైకోర్టులో హౌస్‌మోషన్‌ పిటిషన్‌ (House Motion Petition) దాఖలు చేశారు. కాళేశ్వరం నివేదికను అసెంబ్లీలో ప్రవేశపెట్టొద్దని ఆయన కోరారు. ఈ మేరకు ఆదేశాలివ్వాలని పిటిషన్‌లో పేర్కొన్నారు. అంతకు ముందు హరీశ్​రావు (Harish Rao) అసెంబ్లీ వద్ద మీడియా చిట్​చాట్​లో మాట్లాడారు. కాళేశ్వరంపై తాము సభలో పవర్‌ పాయింట్ ప్రెజెంటేషన్‌ ఇస్తామంటే ప్రభుత్వం ఎందుకు భయపడుతుందని ప్రశ్నించారు. శ్రీధర్‌బాబు వాస్తవాలను వినడానికి సిద్ధంగా లేరన్నారు. నిజాలు తేల్చాల్సింది కోర్టు అని వ్యాఖ్యానించారు.

    Harish Rao | బీఆర్​ఎస్​లో ఆందోళన

    కాళేశ్వరం నివేదికపై (Kaleshwaram Report) బీఆర్​ఎస్​లో ఆందోళన నెలకొంది. ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిషన్​పై బీఆర్ఎస్​ వర్కింగ్​ ప్రెసిడెంట్​ కేటీఆర్(KTR) తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అది పీసీ ఘోష్​ కమిషన్ కాదని పీసీసీ కమిషన్​ అని​ వ్యాఖ్యానించారు. కాళేశ్వరంలో అక్రమాలు, డిజైన్​ మార్పులపై సుదీర్ఘంగా విచారణ చేపట్టిన కమిషన్​ జులై 31న నివేదిక సమర్పించింది. కేసీఆర్​ తీరుతోనే ప్రాజెక్ట్​ కుంగిపోయిందని కమిషన్​ పేర్కొన్నట్లు సమాచారం. ఈ క్రమంలో అసెంబ్లీలో నివేదికను ప్రవేశ పెడితే బీఆర్​ఎస్​కు నష్టం వాటిల్లే అవకాశం ఉంది.

    Harish Rao | స్థానిక ఎన్నికల వేళ

    రాష్ట్రంలో త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు (Local Body Elections) రానున్నాయి. ఈ క్రమంలో గులాబీ పార్టీని ఇరుకున పెట్టడానికి కాంగ్రెస్​ అసెంబ్లీలో కాళేశ్వరం కమిషన్​ నివేదిక పెట్టాలని నిర్ణయించింది. అయితే దీనిపై చర్చ జరిగితే స్థానిక ఎన్నికల్లో పార్టీ నష్టం జరుగుతుందని బీఆర్​ఎస్​ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే హరీశ్​రావు హైకోర్టు (High Court) ఆశ్రయించడం గమనార్హం.

    More like this

    Mla Prashanth Reddy | గుత్ప, చౌచ్​పల్లి హన్మంత్​రెడ్డి లిఫ్ట్​లను ప్రారంభించాలి

    అక్షరటుడే, ఆర్మూర్: Mla Prashanth Reddy | గుత్ప (Guthpa), చౌట్​పల్లి హన్మంత్​రెడ్డి లిఫ్ట్​లను (Choutpally Hanmanth Reddy...

    Non-veg Shops | ప‌ది రోజుల త‌ర్వాత మ‌ళ్లీ క‌ళ‌క‌ళ‌లాడుతున్న నాన్‌వెజ్ షాపులు.. పెరిగిన డిమాండ్, ధ‌ర‌లు స్థిరంగా

    అక్షరటుడే, వెబ్​డెస్క్​: Non-veg shops | గణేశ్ నవరాత్రుల (Ganesh Navaratri) సంద‌ర్భంగా చాలా మంది నాన్‌వెజ్‌కి దూరంగా...

    BC Declaration | బీసీ డిక్లరేషన్ సభాస్థలిని పరిశీలించిన మంత్రుల బృందం

    అక్షరటుడే, కామారెడ్డి: BC Declaration |  బీసీ డిక్టరేషన్​ అమలు సభను ప్రతిష్టాత్మకంగా నిర్వహించేందుకు కాంగ్రెస్​ పార్టీ సమాయత్తమైంది....