అక్షరటుడే, వెబ్‌డెస్క్ : ACB Case | కాళేశ్వరం ప్రాజెక్ట్ (Kaleshwaram Project) ఈఈగా ఉన్న సమయంలో భారీగా అక్రమాలకు పాల్పడి కోట్లకు పడగలెత్తిన నూనె శ్రీధర్ (NuneSridhar) ఇళ్లపై ఇటీవల ఏసీబీ (ACB) దాడులు చేసిన విషయం తెలిసిందే. రూ.200 కోట్లకు పైగా ఆయన అక్రమాస్తులు ఉన్నట్లు గుర్తించిన ఏసీబీ అధికారులే షాక్ అయ్యారు. అయితే ఆయనను గతంలో అరెస్ట్ చేయగా నాంపల్లి ఏసీబీ కోర్టు రిమాండ్ విధించింది. దీంతో ఆయన ప్రస్తుతం చర్లపల్లి జైలులో ఉన్నారు. ఈ క్రమంలో శ్రీధర్ను కస్టడీకి ఇవ్వాలని ఏసీబీ ఇటీవల పిటిషన్ వేసింది. వారం రోజులు కస్టడీకి ఇవ్వాలని ఏసీబీ కోరగా.. ఐదు రోజులు కస్టడీకి ఇస్తూ కోర్టు తీర్పు చెప్పంది. దీంతో శుక్రవారం నుంచి ఐదు రోజుల పాటు నూనె శ్రీధర్ను ఏసీబీ అధికారులు ప్రశ్నించనున్నారు.
